Ward 25 Review: Development Works Promised in Narsampet
25వ వార్డులో సమస్యలపై సమీక్ష.. అభివృద్ధి పనులకు హామీ
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామనంద్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డును మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులోని రోడ్లు, డ్రైనేజ్, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.
అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ, వార్డులో త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణంతో పాటు అవసరమైన చోట సీసీ కల్వర్టులు నిర్మించి మురుగునీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మురుగు కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దోమల బెడద పెరుగుతోందని పేర్కొంటూ, కాలువలను తరచూ శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని సిబ్బందికి ఆదేశించారు.ఇంటింటికీ చెత్త సేకరణను క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు, రోడ్లపై చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కటా ప్రభాకర్, వార్డు యువకులు కటా అఖిల్, కిసరి రాజు, నల్గొండ వంశీ, పుట్ట జగదీష్, చీకటి శివమణి, సాయి పటేల్, వార్డు ఆఫీసర్ సుష్మ, టౌన్ వాటర్ సప్లై ఇన్చార్జ్ కాట శ్రీను, వార్డు జవాన్లు మాదాసి శ్రీను, నాతి రాజు, టౌన్ ప్లానింగ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
