U-Dise వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం..
ఒదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండల కేంద్రంలో ఎమ్మార్ సి కార్యాలయం లో ప్రధానోపాధ్యాయుల మరియు Diet కాలేజ్ కరీంనగర్ శిక్షణ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం యం ఈ ఓ వై.రమేష్ ఆధ్వర్యం లో జరిగింది.
ఓదెల మండలంలో ఎంపిక కాబడిన 20 ప్రభుత్వ పాఠశాలల్లో కరీంనగర్ డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులు అఖిల మరియు అమూల్య ల చే వెరిఫికేషన్ చేపించడం జరిగింది. ఇందులో భాగంగా U-Dise లో నమోదు చేసిన సమాచారం క్రాస్ వెరిఫికేషన్ కోసం 20 పాఠశాలలను తేది 16.04.2025 నుండి తేది 21.04.2025 వరకు ప్రత్యక్షంగా పాఠశాల భవనాలు, తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీరు, ల్యాబ్, ఫర్నిచర్,క్రీడ స్థలం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు , మధ్యాహ్న భోజనం, Kitchen Garden, విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను సేకరించడం జరిగింది.ఈ వివరాలను సేకరించడం లో డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులను, మరియు సీ ఆర్ పి లను యం ఈ ఓ సమన్వయ పరిచారు. సమావేశంలో శిక్షణ ఉపాధ్యాయుల యొక్క సేవలను గుర్తించి వారిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో complex ప్రధానోపాధ్యాయులు బి.సాంబయ్య ,యం లక్ష్మీనారాయణ కేజీవీబీ ఓదెల ఎస్ఓకే జ్యోతి, యుపిఎస్ హరిపురం మహేందర్ రెడ్డి, రమేష్, సిపిఎస్ ఓదెల నాగరాజు, ఎంఆర్సి కార్యాలయ సిబ్బంది ఎం ఐ ఎస్ డి వెంకటేష్, సి సి ఓ ఎల్ కుమార్, సి అర్ పి టి ఓంకార్ బి రజిత ఈ రాజేందర్ టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.