భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
సింగరేణి
డైరెక్టర్ (ఈ అండ్.ఎం అండ్ ఆపరేషన్స్) డి. సత్యనారాయణ రావు మరియు డైరక్టర్ ( పి అండ్ పి పా) జి.వేంకటేశ్వర రెడ్డి
భారత ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశాల మేరకు అక్టోబర్ 02 వ తారీఖు నుండి 31 వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తముగా నిర్వహించబోయే స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమము కొరకు ముందస్తు ప్రణాళిక లో భాగముగా ఈ నెల 16.09.2024 నుండి 30.09.2024 తేదీ వరకు పరిశుభ్రం చేయవలసిన పరిసరాల ఎంపిక చేసే కార్యక్రమం కొరకు ఈ రోజు సింగరేణి భవన్ నుండి డైరెక్టర్ డి. సత్యనారాయణ రావు మరియు డైరక్టర్ (పి అండ్ పి పా) జి.వేంకటేశ్వర రెడ్డి. అన్ని విభాగాల మరియు అన్ని ఏరియా ల జనరల్ మేనేజర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్భముగా సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్.ఎం అండ్ ఆపరేషన్స్) డి. సత్యనారాయణ రావు మరియు డైరక్టర్ (పి అండ్.పి అండ్ పా) జి.వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 02 వ తారీఖు నుండి 31 వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తముగా అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్ల నందు ఈ స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమము నిర్వహించాలని, ఈ కార్యక్రమములో భాగముగా ఆఫీసు మరియు గనుల నందు మరియు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుబ్రపరచుకోని, సుందరికరించుకోవాలని, గనుల నందు ఉండే స్క్రాప్ ను కూడా తీసివేయాలని, ఆఫీసుల నందు ఉండే పెండింగ్ ఫైల్స్ ను త్వరత గతిన పూర్తి చేయాలని, రికార్డ్స్ రూమ్ లను శుభ్ర పరచుకొని రికార్డులను క్రమ సంఖ్య లో పొందుపరచుకోవాలని అదే విధముగా ఈ స్పెషల్ క్యాంపెయిన్ 4.0 లో చేసిన కార్యక్రమాల నివేదికను రోజువారిగా సింగరేణి ప్రధాన కార్యాలయం కు పంపించాలని తెలిపారు. అదే విధముగా ఈ స్వచ్ఛతా కార్యక్రమము అన్ని ఏరియాలలో సమర్ధవంతముగా నిర్వహించేందుకు తగిన చర్యలను తీసుకోవాలని అన్ని విభాగాల మరియు అన్ని ఏరియా ల జనరల్ మేనేజర్ల ను ఆదేశించారు.
అనంతరం & జిఎం(ఐ&పిఎం) నోడల్ ఆఫీసర్ ఏ.రవి కుమార్ ఈ స్పెషల్ క్యాంపెయిన్ 4.0 లో చేయవలసిన కార్యక్రమాల విధి విధానాలను డైరక్టర్లకు మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమములో సింగరేణి డైరెక్టర్ ( ఈ అండ్.ఎం అండ్ ఆపరేషన్స్) డి. సత్యనారాయణ రావు మరియు డైరక్టర్ డైరక్టర్ (పి అండ్ పి పా) శ్రీ జి.వేంకటేశ్వర రెడ్డి తో పాటు జిఎం(సిడిఎన్) ఎస్‌డిఎం సుభాని, జిఎం(మార్కెటింగ్) రవి ప్రసాద్, కార్పొరేట్ ఆఫీస్ నుండి సింగరేణి స్పెషల్ క్యాంపెయిన్ 4.0 నోడల్ ఆఫీసర్.జిఎం(ఐపిఎం) ఏ.రవి కుమార్, అన్ని విభాగాల మరియు అన్ని ఏరియా ల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు