చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కార్యనిర్వహణ అధికారి విజయలక్ష్మి చిట్యాల నవాబ్ పేట మరియు ఏలేటి రామయ్యపల్లి గ్రామాలలోని నర్సరీలు, వ్యక్తిగత మరుగదొడ్లు నిర్మించుకున్న వారికి చెల్లింపుల విషయము మరియు చిట్యాల మండల పరిధిలోని అన్ని గ్రామాలలో మంచినీటి సరఫరా పరిస్థితి పై ఆర్డబ్ల్యూఎస్ ఏఈతో సమీక్షించారు. అనంతరం మండల కార్యలయం లో పంచాయితి కార్యదర్శులతో.2022.23 సంవత్సరంకి సంబంధించిన పంచాయత్ అభివృద్ధి సూచిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇట్టి ప్లాన్ తేది 03.03.2024 వరకు పూర్తి చేయాలి అని ఆమె కొరారు. ఈ కార్యక్రమము లో ఎంపిడిఒ ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ అనిల్ కుమార్, ఎంపీ ఓ రామ కృష్ణ ఏపీఓ అలీమ్ టెక్నికల్ అసిస్టెంట్లు సుధాకర్, స్వామి మరియు పంచాయతి కార్యదర్శులు రవికుమార్,సుచరిత దేవేందర్ ఎఫ్ఏఎస్ మేట్స్ వాచర్లు తదితరులు పాల్గొన్నారు.