దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండలంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాది హామీ పథకం పనుల పట్ల బుదవారం ఎంపీడీఓ మండల అభివృద్ధి కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి సంగీత లక్ష్మి అధ్యక్షత సమీక్షా సమావేశం నిర్వహించారు.జరుగబోయే పనుల ప్లానింగ్ అలాగే వాటి నిర్వహణ పట్ల చర్చించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లెక్కల అరుంధతి,మండల వ్యవసాయ అధికారి మాధవి, మండల పంచాయతీ అధికారి ఎం శ్రీధర్ గౌడ్, ఏపీవో శ్రీనివాస్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు,ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.