మంగపేట నేటిధాత్రి
తహసిల్దార్ కార్యాలయంలో అటవీశాఖ మరియు రెవిన్యూ శాఖ వారు మంగపేట గ్రామములోని సర్వే నెం.107,108 మరియు 125/1 లలో గల సరిహద్దు వివాదాములపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేయుట గురించి రికార్డు పరిశీలన చేయుట కొరకు తహసిల్దార్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం జరిగినది. ఇట్టి సమావేశంలో తహసిల్దార్ శ్రీ బి. వీరస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ శ్రీ దేవరాజ్ గారు, డిఐ శ్రీ రాజనర్సయ్య, శ్రీ నాగరాజు గార్లు మరియు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీ షకీల్ పాషా, డిప్యూటి రేంజ్ అధికారి శ్రీ కోటి గారు, ఆర్ఐ కుమారస్వామి, మండల సర్వేయర్ యస్.కె సఫియా గార్లు పాల్గొనడం జరిగినది.