మందమర్రి, నేటిధాత్రి:-
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పిట్ స్టోర్స్, ఏరియా స్టోర్స్ లలో గల మెటీరియల్స్ స్టాక్ గురించి బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అన్ని గనుల, డిపార్ట్మెంట్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో ఏజీఎం ఈఅండ్ఎం ఏ నాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియా స్టోర్, పిట్ స్టోర్ లలో ఉత్పత్తికి విగాతం కలగకుండా యంత్రాల అన్ని విడిభాగాలను అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్లు, పిట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.