నడికూడ,నేటిధాత్రి:
పరకాల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ డాక్టర్ కణ్ణం నారాయణ నడికూడ మండలంలోని ఉన్నత,ప్రాథమిక పాఠశాలలను సందర్శించడం జరిగింది.పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల విద్యా ప్రగతి పైన ఉపాధ్యాయులతో చర్చించారు.పాఠశాలల్లో ఉన్న మౌలిక అవసరాలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు.దాతల సహాయంతో కూడా ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు .
ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని,పదవ తరగతిలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయ్యే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఐదవ తరగతి విద్యార్థి సఫియాను స్థానిక తహసీల్దారు నాగరాజు దత్తత తీసుకున్న విషయాన్ని తెలుసుకొని తాహసిల్దార్ నాగరాజు ని ఆర్డిఓ అభినందించారు.
ఈ సందర్భంగా నడికూడ మండల తహసీల్దార్ డి. నాగరాజు మాట్లాడుతూ పాఠశాలకు అవసరమై నటువంటి లైబ్రరీ,ల్యాబ్ కు సంబంధించిన సౌకర్యాలను కల్పించడంలో తాను కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో
నడికూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,యం ఈ వో కే హనుమంతరావు, ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం కృపారాణి,ఉపాధ్యాయులు శ్రీనివాస్,జయ,శివ చేతన్, శ్రీనివాస్ రెడ్డి,శ్రావణ్ కుమార్, తిరుపతి,సుభాని, శివకుమార్,శారద, జ్యోత్స్న,రాజు,కుమారస్వామిరవీందర్ తదితరులు పాల్గొన్నారు.