
JAC Chairman Dr. R. Parameshwar
ఉదృతమైన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశం
ఆగస్టు 12 విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చిన జేఏసీ
జేఏసీ చైర్మన్ డా. ఆర్. పరమేశ్వర్
చేర్యాల నేటిదాత్రి
చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు తారాస్థాయికి చేరుకున్నాయి కొమురవెల్లి మద్దూరు దుల్మిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ చేయాలని చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు దీనిలో భాగంగా జేఏసీ బందుకు పిలుపునివ్వడం జరిగినది ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినందున మరింత ఉదృతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని జేఏసీ భావించింది దానిలో భాగంగా ఈనెల ఆగస్టు 12వ తేదీ విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చారు ఇచ్చే ప్రతీ పిలుపును ప్రజల పిలుపుగా భావించి రెవెన్యూ డివిజన్ సాధన కోసం జరిగే జేఏసీలో ప్రజలు భాగస్వాములు కావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత సమావేశానికి ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, ఆకాంక్షను నెరవేర్చడం చేర్యాలకు పూర్వ వైభవాన్ని సాధించి రానున్న భవిష్యత్తు తరాలకు చేర్యాల ప్రాంతం యొక్క ఔన్నత్యం సామాజిక, రాజకీయ నేపథ్యం పరిపాలన యొక్క గొప్పతనాన్ని రేపటి తరాలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ మనసారా ఆస్వాదించడానికి మాత్రమే ఆగస్టు12న విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. కావున నాలుగు మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ కు ఉపాధ్యాయులు, యజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును ప్రజల పిలుపుగా భావించి అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అందె అశోక్, అందె బీరయ్య, బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, కత్తుల భాస్కర్ రెడ్డి, జంగిలి యాదగిరి, పోలోజు వెంకటాద్రి, పొన్నబోయిన మమత, కుడిక్యాల బాలమోహన్, వలబోజు నర్సింహ చారి, పెండ్యాల రాజు, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, కవ్వం నారాయణ రెడ్డి, గడిపే రవి, కర్రె నర్సిరెడ్డి, పీ. శ్రీనివాస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.