నస్పూర్ సర్వే నంబర్ 42లో అక్రమ నిర్మాణాలను తొలగించిన రెవిన్యూ ,మునిసిపల్ సిబ్బంది
అక్రమ నిర్మాణాల గురించి ముందే హెచ్చరించిన నేటిదాత్రి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి
నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవా సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఎమ్మెల్యే ను అక్రమ నిర్మాణాల గురించి వరించిన కూడా మౌనం పాటించారు
నస్పూర్ మునిసిపాలిటీ లోని 42 సర్వే నంబర్ నూతన కలెక్టరేట్ సమీపంలో ని టి ఎన్ జి ఓ అధికారులకు కేటాయించిన స్థలంలో కొందరు భూ అక్రమార్కులు తాత్కాలిక షెడ్యులు వేసి కబ్జా చేయాలని ప్రయతించారు అమాయక ప్రజల నుండి ఒక్కో ప్లాటుకు సుమారు 15లక్షల నుండి 20 లక్షల వరకు బేరం కుదురుచుకన్నారని సమాచారం .ముందుగా సదరు ప్లాటు కొనుగోలుదారుడి నుండి అడ్వాన్స్ గా కొంతమొత్తం తీసుకొని కొనుగోలుదారుడి డబ్బులతోనే తాత్కాలిక షెడ్యూలు వేయించి ఆ తరువాత పక్క ఇల్లు నిర్మాణం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు ఒప్పందం ప్రకారం ప్లాటు కొనుగోలుదారుడిచేత షెడ్డు వెపించారు అప్పుడున్న తాజా మాజీ ఎమ్మెల్యే అండదండలతో పని పూర్తి చేశారు కానీ ఎన్నికల తరువాత అంత మరిపోంది ఇప్పుడు అక్రమార్కుల మీద అధికారులు కొరడా జులిపించి అక్రమ నిర్మాణాలను తొలగించారు ఈ విషయం పై నేటిదాత్రి ప్రతినిధి నస్పూర్ మండల తాసిల్దార్ నీ ఫోన్లో సంప్రదించగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో వెళ్లి పర్మిషన్ లేకుండా ఇంటి నెంబర్లు లేని అక్రమ నిర్మాణాలను తొలగించామని ఆమె బదులిచ్చారు