రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌2024 పేరుతో అసెంబ్లీలో బిల్లు

తెలంగాణ భూభారతి చట్టంగా వ్యవహరణ

ధరణిలో పొరపాట్లను సరిదిద్దేందుకే

చట్టం రూపకల్పనలో రేవంత్‌ ప్రత్యేక శ్రద్ధ

ఇక గ్రామకంఠంలోని నివాసాలకు పాస్‌పుస్తకాలు

రైతులు భూ యజమానులకు అనుకూలంగా పలు సెక్షన్లు

తిరిగి అమల్లోకి రానున్న రెవెన్యూ ట్రిబ్యునళ్లు

సాదా బైనామాల క్రమబద్ధీకరణ

సీసీఎల్‌ఏకు ప్రత్యేక అధికారాలు

చట్టంలో మార్పులు అంత తేలిక కాదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రస్తుతం తెలంగాణలో అమల్లో వున్న ధరణి స్థానంలో ‘రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ా2024’ పేరుతో బిల్లును రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి డిసెంబర్‌ 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్ని ‘తెలంగాణ భూభారతి (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌) చట్టరా2024’గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీనుంచి ప్రభుత్వం దీనికి సంబంధించిన మూడు ముసాయిదాలను విడుదల చేసింది. అందులో 20 సెక్షన్లుండగా మార్పులు చేర్పులతో 23 సెక్షన్లతో బిల్లునుఅసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిజం చెప్పాలంటే భూ భారతి కోసం ప్రభుత్వం పెద్ద కస రత్తే చేసింది. ఆగస్టు 2న తొలి ముసాయిదాను విడుదల చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో సలహాలు, సూచలను వివిధ వర్గాలనుంచి సేకరించింది. ప్రజాభిప్రాయాలు తెలుసుకునేందుకు జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించింది. వాటికి అనుగుణంగా ముసాయిదాను 14సార్లు మార్చింది. మొ త్తంగా 24సార్లు సవరించి, చివరగా 24వ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆఖరికి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కొద్ది గంటల ముందు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికార్లతో చర్చిస్తూ ఈబిల్లులో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ రావడాన్ని చూస్తే ఆయన ఈ బిల్లును ఎంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. ఈ బిల్లు రూపకల్పనలో భూ చట్టాల నిపుణుడు ఎం. సునీల్‌కుమార్‌ ప్రత్యేక శ్రద్ధతో పనిచేశారు. ఇంకా రెవె న్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, సీసీఎల్‌ఏ అసిస్టెంట్‌ సెక్రటరీ వి. లచ్చిరెడ్డి ఈ బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.

భూ యజమానుల సమస్యలకు పరిష్కారం

దశాబ్దాలుగా నివాస స్థలాలపై హక్కులు లేని గ్రామ కంఠం భూములకు పట్టాదారు పాసుపుస్తకాల (రికార్డులు) జారీచేయడానికి ప్రభుత్వం ఈ బిల్లులో అవకాశం కల్పించింది. రైతులు, భూయజమానుల సమస్యలకు పరిష్కారాలు కూడా చట్టబద్ధం చేసేవిధంగా పలు సెక్షన్లను పొందుపరి చారు. అయితే ఏకకాల రిజిస్ట్రేషన్‌`మ్యుటేషన్‌ విధానంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన మూడు నెలల్లోగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చే స్తుంది. ఆ తర్వాత చట్టంలోని సెక్షన్లు అమల్లోకి వస్తాయి. ఈ చట్టం కింద ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక సంఖ్యను, కార్డును జారీచేయాలని యోచిస్తోంది. ఇది సరిగ్గా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చే ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌, ‘భూదార్‌’ పద్ధతిలోనే వుంటుంది. అ యితే భూ సర్వేను పూర్తిగా నిర్వహించకుండా సంఖ్య, కార్డును జారీచేస్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, ముందు తాత్కాలికంగా వీటిని జారీచేసి భూమి సర్వే నిర్వహించిన తర్వాత శాశ్వత సంఖ్య, కార్డును జారీచేయాలని నిర్ణయించింది.

రెవెన్యూ ట్రిబ్యునళ్లకు ఊపిరి

భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం మళ్లీ రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయనుంది. అయితే నోటిఫికేషన్‌ ద్వారా జారీచేసే ఈ ట్రిబ్యునళ్లను ఎన్ని, ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రభుత్వానిదే. ఇవి ఏర్పాటయ్యేవరకు సీసీఎల్‌ఏనే ల్యాండ్‌ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. భూవివాదాల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే రెండు అప్పీళ్ల వ్యవస్థలుంటాయి. తహసీల్దార్‌, ఆర్డీఓ స్థాయిలో భూసమస్యకు పరిష్కారం లభించకపోతే అరవై రోజుల్లోగా కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవ చ్చు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌దే తుది నిర్ణయం. కొన్ని కేసులను నేరుగా ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఒకవేళ ఇక్కడ ఆర్డీవో నిర్ణయంతో విభేదిస్తే 30రోజుల్లోగా కలెక్టర్‌కు అప్పీ లు చేసుకోవచ్చు. కలెక్టర్‌ నిర్ణయంతో కూడా విభేదిస్తే 30 రోజుల్లోగా ట్రిబ్యునల్‌కు అప్పీలు చే సుకోవచ్చు. ఇక ఈ విషయంలో ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. ట్రిబ్యునల్‌, అప్పిలేట్‌ అధికారులకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేని రైతులకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయసహాయం అంది స్తుంది. ఇందుకోసం ప్రభుత్వం మండల స్థాయిలో వలంటీర్లను ఏర్పాటు చేయనుంది. ఇక భూదార్‌ కార్డుల జారీ, పట్టాదారు పాసుపుస్తకాల జారీకి సంబంధించిన అప్పీళ్లను ఆర్డీఓ చూసుకో వాలి.

సీసీఎల్‌ఏకు అధికారాలు

సర్వే నెంబర్లను అవసరానికి అనుగుణంగా సబ్‌డివిజన్‌ చేసుకునేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌, భూదాన్‌, అసైన్డ్‌, లావణి భూముల వివాదాలపై సు మోటోగా లేదా దరఖాస్తుల స్వీకరణ ద్వారా విచారణ జరిపి సవరించే అధికారం, అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికి దఖలు పరచే అధికారం భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు వుంటుంది. అప్పీలేట్‌, రివిజన్‌ అథారిటీలకు సివిల్‌ కోర్టుల కుండే అధికారాలను ప్రభుత్వం దఖలు పరుస్తోంది. భూమి రికార్డులను తారుమారు చేసి, హక్కుల రికార్డుల్లో తప్పులు చేసిన అధికార్లను తొలగించే అధికారం ప్రభుత్వానికుంటుంది. మోసపూరితంగా పట్టాదార్‌ పాస్‌ పుస్తకాన్ని జారీచేస్తే దాన్ని రద్దుచేసే అధికారం కలెక్టర్‌కు వుంటుంది.అంతేకాదు సంబంధిత భూమిని కలెక్టర్‌ స్వాధీనం చేసుకొని క్రిమినల్‌ చర్యలు చేపట్టవచ్చు. దీంతో కేవలం యాజమాన్య హక్కుల కోసమే సివిల్‌ కోర్టులను ఆశ్రయించాల్సి వుంటుంది. తప్పొప్పుల గురించి కోర్టులకు వెళ్లడం కుదరదని చట్టంలో ప్రభుత్వం స్పష్టం చేసింది.

సాదాబైనామాల క్రమబద్ధీకరణ

సాదాబైనామా (తెల్లకాగితాలపై ఒప్పందాలు)ల ద్వారా 2014, జూన్‌ 2కు ముందు జరిగిన కొ నుగోళ్లను క్రమబద్ధీకరించే అవకాశాన్ని ఆర్‌ఓఆర్‌`2024 చట్టం సెక్షన్‌ 6(1) ద్వారా కల్పించా రు. ఆర్‌ఓఆర్‌ 1971 చట్టం కింద 2020, సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 10 వరకు 9.24లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం వీటి క్రమబద్దీకరణ ఇంకా ఎటూ తేలలేదు. వీటిని ఆర్డీఓ స్థాయిలో విచారణ జరిపి పరిష్కరించనున్నారు. వీలునామా లేని ఆస్తుల విషయంలో యాజమాన్య హక్కుల బదిలీ (సక్సెషన్‌) సందర్భంగా ఏకకాల రిజిస్ట్రేషన్‌`మ్యుటేషన్‌ విధానాన్ని రద్దు చేశారు. కొత్త విధానం ప్రకారం ఇకపై వారసులంతా సంయుక్త వివరణను సమర్పించాల్సి వుం టుంది. అప్పుడు తహసీల్దార్‌ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీచేసి విచారణ జరుపుతారు. ఆతర్వాతనే మ్యుటేషన్‌ చేసి సెక్షన్‌ 7(4) కింద కుటుంబ సభ్యులకు వివరాలు అందిస్తారు. అన్ని రకాల ప్రభుత్వ భూముల రక్షణకు కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లు పొందుపరచారు. వీటద్వారా సుమోటోగా తీసుకొని విచారణ జరపవచ్చు.

చట్టంలో మార్పులు చేయడం కుదరదు

ఆర్‌ఓఆర్‌ా2024 చట్టంలో మార్పులు తెచ్చే అధికారం ఎవరికీ లేదు. ఆవిధంగా ఈ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. అయితే అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఒక ప్రకటన ద్వా రా ఇందులో సెక్షన్లు, క్లాజులు మార్చుకునే అవకాశం వుంది. ఇదిలావుండగా 2017ా18నాటి ప్రభుత్వం చేపట్టిన ఫైళ్ల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా చిన్న సమస్యలతో పక్కన బెట్టిన 18లక్షల ఎకరాల భూములకు ఇప్పుడు ప్రభుత్వం స్పష్టత తీసుకొచ్చి, హక్కులు కల్పించనుంది. ఆర్‌ఓఆర్‌ా2024 చట్టంలోని సెక్షన్‌ 4(1) ప్రకారం గ్రామాల్లోని అన్ని రకాల భూములకు హక్కుల రికార్డులు రూపొందిస్తారు. డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో భూభాగాలను మ్యాపింగ్‌ చేయనున్నా రు. భూ యజమాని, పట్టాదారు, తనఖాదారుల పేర్లు, వారి వివరాలు నమోదు చేసి ఆస్తుల యజమానులను గుర్తిస్తారు. గ్రామాల్లోని ఆబాదీ లేదా గ్రామకంఠం భూముల్లో నివాస స్థలాలకు ఇప్పుడు కొత్త చట్టం సంపూర్ణ హక్కులు కల్పిస్తుంది. పట్టాదారు పాసుపుస్తకం లేదా ధ్రువీకరణ ప త్రాన్ని ప్రభుత్వం జారీచేస్తుంది. ఆన్‌లైన్‌లో ఈ భూముల నిర్వహణ కొనసాగుతుంది. ఇందు కోసం త్వరలోనే ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి, హక్కుల రికార్డుల తయారీకి ఉపక్ర మిస్తుంది. భూముల క్రయవిక్రయాల సందర్భంగా భూమి సర్వే, సబ్‌డివిజన్‌ సర్వే పటాన్ని తప్పనిసరిగా జోడిరచాల్సి వుంటుంది. దీనివల్ల రెండేసి రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణ వివాదాలకు తెరపడనుంది. సర్వే పటాన్ని రికార్డుల్లో భద్రపరుస్తారు.

ఈ చట్టం ఎందుకు?

2020, అక్టోబర్‌ 29 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం వల్ల భూ యజమానులకు ఇబ్బందులు కలిగాయని, ధరణి పోర్టల్‌లో లెక్కలేనన్ని పొరపాట్లున్నాయని బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ పొరపాట్లను సరిదిద్దే వెసులబాటు ధరణి కల్పించలేదని, భూమి రికార్డులను సరిదిద్దుకునేందుకు సివిల్‌ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరదని ప్రభుత్వం పేర్కొంది. అదీ కాకుండా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవసరమైన వెసులుబాటు ఆ చట్టం లో లేదని పేర్కొంది. ప్రస్తుతం సభముందుంచిన చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూ వివా దాలు తగ్గుతాయని, ప్రజలు వారి ఆస్తులు, భూములను వారి అవసరాలకు వినియోగించుకునేం దుకు, వారికి ఆర్థిక స్థిరత్వం కలిగించేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం సభకు తెలిపిం ది. ప్రభుత్వ భూముల రక్షణ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సులభంగా భూ రికార్డుల పోర్టల్‌ నిర్వహణ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, ప్రతి భూమికి భూదార్‌ నెంబరు, కార్డుల జారీ, వ్యవసాయ భూములు, ఆబాదీ హక్కుల కోసం రికార్డు తయారీ, హక్కుల రికార్డులో మ్యుటేషన్‌ పద్ధతిని సరిదిద్దడం, భూ రికార్డుల పోర్టల్‌లో నమోదైన తప్పులను సరిదిద్దే వ్యవస్థను నెలకొల్పడం, పార్ట్‌`బిలో పెట్టిన భూముల సమస్యలను పరిష్కరించడం, ప్రస్తుత రికార్డులను అప్‌గ్రేడ్‌ చేయ డంతో పాటు, భూముల రీసర్వే నిర్వహించి కొత్త రికార్డులు తయారుచేయడమే కొత్త చట్టం తీసుకు రావడంలో ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

‘భూ భారతి’ వైఎస్‌ఆర్‌ హయాంలోని పేరు

ప్రస్తుతం రేవంత్‌ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లురూపంలో ప్రవేశపెట్టిన చట్టానికి ‘భూ భారతి’ అని పేరు ఖరారు చేసింది. నిజానికి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో వై.ఎస్‌.ఆర్‌ ముఖ్యమంత్రిగావున్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారి భూ రికార్డుల ఆధునీకరణ పైలెట్‌ ప్రాజెక్టును నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఆ ప్రాజెక్టుకు ‘భూ భారతి’ అని పేరుపెట్టారు. ప్రస్తుతం ఈ చట్టానికి భూమాత, భూభారతి, వెబ్‌ల్యాండ్‌, మాభూమి అని నాలుగు పేర్లు ప్రతిపాదించగా వీటిల్లో భూ భారతిని ప్రభుత్వం ఖరారు చేసింది. సర్క్యులేషన్‌ విధానంలో మంత్రివర్గం ఆమోదం తీసుకొని ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!