#తెలంగాణలో కేసీఆర్ గుర్తులను చేరిపేయడం రేవంత్ రెడ్డి తరం కాదు.
#కోల్పోయింది అధికారం మాత్రమే…. పోరాట తత్వం కాదు.
#మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం ఎదుట కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను నిరసిస్తూ బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని బొల్లోనిపల్లి గ్రామ బస్టాండ్ సెంటర్లో ఉన్న ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకంతో శుద్ధిచేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు అనే మోసపూరిత వాగ్దానాలతో గద్దె నెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అనాలోచిత నిర్ణయాలతో ఉద్యమ చరిత్ర కలిగిన కేసీఆర్ గుర్తులను చెరిపేయలనుకోవడం తెలివి తక్కువ తనమన్నారు..ముఖ్యమంత్రి నిర్ణయాలతో తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందన్నారు.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు..కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపెళ్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, మాజీ వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, క్లస్టర్ ఇంచార్జి మామిoడ్ల మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు చీకటి ప్రకాష్, దేవేందర్, బొట్ల సువర్ణ ఎల్లస్వామి, గుగులోతు రవళి రాము, సారయ్య, పాలేపు రవీందర్, బొల్ల శ్రీలత రమేష్, మండల నాయకులు గొనె రాంబాబు, బొట్ల పవన్, భట్టు సాంబయ్య, తిప్పని రవీందర్, మోహన్, సురేష్, బత్తిని కుమారస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు రాము, చాంద్ పాషా, పులి రమేష్, గుంపుల రాజు తదితరులు పాల్గొన్నారు