
: Telangana Govt Increases Ex-Gratia for Construction Workers
నిర్మాణ రంగ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్
రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు వర్తింపు
యాక్సిడెంట్ డెత్ ఎక్స్గ్రేగే షియా రూ.5 లక్షల నుంచి రూ10 లక్షలకు
సహజ మరణానికి రూ 1.30 లక్షల నుంచి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం
ఐఎన్ టి యు సి శాయం పేట మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్
శాయంపేట నేటిధాత్రి:
నిర్మాణ రంగ కార్మికుల ఎక్స్ గ్రేషియా పెంపు వలన రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు ఉపయోగ ఉంటుందని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ తెలిపారు.మండల అధ్యక్షుడు మాట్లాడుతూ యాక్సిడెంటల్ చనిపోతే ఎక్స్‌గ్రేషియా రూ ఆరు లక్షల నుంచి రూ పది లక్షలకు, సహజ మరణానికి రూ లక్ష ముప్పై వేల నుంచి రూ రెండు లక్షలకు ప్రభుత్వం పెంచింది అన్నారు. దీనివలన భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నరు అన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణ యించిందని అన్నారు.ఇందు లో భాగంగా యాక్సిడెంటల్ డెత్ ఎక్స్‌గ్రేషియాను రూ పది లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని రూ రెండు లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ నిర్ణయించిందని అన్నా రు . వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుం బాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించ నుంది. ఎక్స్‌గ్రేషియా పెంచాల ని గత సర్కార్ హయాంలో ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్‌మ న్లు, టన్నెల్‌వర్కర్స్,బావి పూడిక తీసేవాళ్లు, మార్బుల్, టైల్స్ వర్కర్లు, రాళ్లు కొట్టేవా ళ్లు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంపు ఆపరేటర్స్, మున్సిపల్ డ్రైనేజీ వర్కర్స్, మిక్సర్ డ్రైవ ర్లు, మెకానిక్, ల్యాండ్ స్కేపింగ్ వర్కర్స్ తదితర యాభై నాలు గు రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీళ్లలో అరవై ఏండ్ల లోపు ఉండి లేబర్‌కార్డు కలిగి న వారందరికీ ఈ బీమా వర్తిం చనుంది అన్నారు. వీటితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూతురి పెండ్లికి రూ ముప్పై వేలు, వర్కర్ భార్యకు లేదా కూతురు ప్రసూతికి రూ ముప్పై వేలు, ప్రమాదవశాత్తు గాయ పడి ఇక పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే రూ నాలుగు లక్షలు, పూర్తిగా వికలాంగులైతే రూ ఐదు లక్షలు అనగా భవన నిర్మాణ కార్మికుల యాక్సిడెంట ల్ డెత్, సహజ మరణానికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా పెంపుపై కార్మికులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఎక్స్‌గ్రేషియా ను పెంచడం ఆనందంగా ఉందన్నారు.రిజిస్ట్రేషన్ కు అర్హతలివే తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద సభ్యులుగా పద్దెనిమిది ఏండ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు గల నిర్మాణరంగ కార్మికులు మాత్రమే అర్హులు అన్నారు. వీరు ఏడాదిలో కనీసం తొంబై రోజులు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి అన్నారు.రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, వయస్సు నిర్ధారణ కు రుజువుగా స్కూల్ సర్టిఫికే ట్ లేదా డాక్టర్ సర్టిఫికెట్‌ను సమర్పించి మెంబర్ షిప్
సంబంధిత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌కు అందజేసి లేబర్ కార్డును పొందొచ్చు అన్నారు . లేబర్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత రెన్యూవల్ చేసుకో వాలి అన్నారు. ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికులకు ఎక్స్ గ్రేషియా పెంచడం పట్ల ఐఎన్ టి యు సి మం డల అధ్యక్షు డు మారపల్లి రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.