ఆత్మ ఆంధ్రాలో..రాజకీయం తెలంగాణలో!!

https://epaper.netidhatri.com/

`మరోసారి బైట పడ్డ రేవంత్‌ అంతరంగం.

`మరో సెల్ఫ్‌ గోల్‌ లో రేవంత్‌.

`ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని వ్యాఖ్య!

`ఉమ్మడి రాష్ట్రంలో పథకాలు తెలంగాణలో అందలేదా? అని రేవంత్‌ ప్రశ్న.

`తెలంగాణ కేవలం స్వేచ్ఛ కోసమే కొట్లాడిరదని కొత్త నిర్వచనం.

`నీళ్లు, నిధులు, నియామకాలు బిఆర్‌ఎస్‌ ట్యాగ్‌ లైన్లని కొత్త భాష్యాలు.

`రేవంత్‌ అవగాహన రహిత్య వ్యాఖ్యలు

`నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షపై రేవంత్‌ విసుర్లు.

`తెలంగాణ మేధావులు, విద్యార్థుల ఉద్యమం స్వార్థపూరితమేనా?

`1969 లో ఉద్యమం ఎందుకు జరిగిందో తెలియదు!

`తెలంగాణ ఎందుకు ఎండిరదో తెలియదు?

`ఆంధ్రా ఎందుకు పచ్చగా వుందో అర్థం కాదు?

`పాలమూరు వలసలకు బాధ్యులెవరో తెలియదు?

`ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదో అవగాహన లేదు?

`శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు 300టిఎంసిల నుండి 60 టిఎంసిలకే ఎందుకు కుదించారో ఆలోచించలేవు?

`అంత పెద్ద కుట్ర మీద అవగాహన లేదు?

`ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనే కరంటు కోతలు ఎందుకు వుండేవో తెలియదు?

`తెలంగాణ చెరువులు ఎందుకు చెదిరిపోయాయో! తెలియదు!`అధికారమిస్తే పాలిస్తారట!

`ఎకరానికి ఎన్ని గంటల కరంటు కావాలో తెలియదు?

`రెతులకు బ్యాంకులు రుణమెంత ఇస్తాయో కనీసం లెక్కలు తెలియవు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ చరిత్ర మీద కనీస అవగాహన లేదు. తెలంగాణ ఉనికి ఉన్నతి మీద శ్రద్ద లేదు. తెలంగాణ ఉద్యమం చేసింది లేదు. జై తెలంగాణ అన నినదించింది లేదు. తెలంగాణ ప్రజలు ఎవరి నుంచి స్వేచ్ఛ కోరుకున్నారో తెలియదు. నిజాం మీద వ్యతిరేకంగా సాగిన సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం ఎందుకు జరిగిందో తెలియదు. 1969లో ఉద్యమం ఎందుకు మొదలైందో తెలియదు. అది ఎక్కడ ఎందుకు ప్రారంభించారో, ఎవరు ప్రారంభించారో తెలియదు. మలి దశ ఉద్యమం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎందుకు ప్రారంభించాల్సివచ్చిందో తెలియదు. తెలంగాణ ఎందుకు వెనకబడిరదో తెలియదు. పాలమూరు ఎందుకు గోపపడిరదో తెలియదు. పాలమూరును ముఖ్యమంత్రి హోదాలో దత్తతు తీసుకున్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఒక్క ప్రాజెక్టు కట్టలేదో తెలియదు. పెండిరగ్‌ ప్రాజెక్టులను ఎందుకు చంద్రబాబు పూర్తి చేయలేదో తెలియదు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ఎంత కటువుగా మాట్లాడాడో తెలియదు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టలేమని చెప్పిన చంద్రబాబు పంచన చేరిండు. ఆయనే పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.
సెల్ప్‌ గోల్‌ చేసుకోవడంతో రేవంత్‌ను మించిన నాయకుడు మరొకరు లేరు.
రేవంత్‌ గురువు చంద్రబాబుకు యూటర్న్‌ బాబు అని ఎలా పేరు సార్ధకమైందో, రేవంత్‌ కు సెల్ప్‌ గోల్‌ రేవంత్‌ అన్నది పదేపదే రుజువు చేసుకుంటున్నాడు. అసలు తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌ లైన్‌తో ఉద్యమం చేయలేదంటూ రేవంత్‌ రెడ్డి కొత్త భాష్యం చెప్పిన తన అవగాహనా రాహిత్యాన్ని మరోసారి నిరూపించున్నారు. కాలం కలిసి వచ్చి, అవకాశాలు అంది వచ్చి నాయకుడయ్యాడే కాని, తెలంగాణ మీద అవగాహన వున్న నాయకుడు కాదని తనే రుజువు చేసుకుంటున్నాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మాత్రమే రేవంత్‌కు తెలిసిన రాజకీయం. ఎకరం పొలం తడవాలంటే ఎంత ఎన్ని నీళ్లు కావాలో..ఎంత కరంటు కావాలో కూడా కనీసం అవగాహన ఆయనకు లేదన్నది గతంలో నిరూపించుకున్నారు. తెలంగాణ రైతుల చేత చీవాట్లు తిన్నాడు. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సమాధానం చెప్పుకోలేక తలలు పట్టుకున్నారు. దాంతో సీనియర్లంతా రేవంత్‌ను కూడా ఓ ఆట ఆడుకున్నారు. ఇక కాంగ్రెస్‌ అంటే రేవంత్‌,రేవంత్‌ అంటేనే కాంగ్రెస్‌ అని మరోసారి సీనియర్ల చేత చీవాట్లు తిన్నాడు. ఇలా ప్రతి సందర్భంలోనూ అటు ప్రజలనుంచో, ఇటు పార్టీ శ్రేణుల నుంచో విమర్శలు ఎదుర్కొవడమే పనిగా పెట్టుకున్నట్లున్నాడు. ఇక ఆ మధ్య రైతులు బ్యాంకుల నుంచి రెండు లక్షల రుణం తీసుకొమ్మని ఓ ఉచిత సలహా పడేశారు. అసలు బ్యాంకులు రైతులకు ఏ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేస్తారన్నదానిపై కనీస పరిజ్ఞానం వుంటే రేవంత్‌ ఆ వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు. ఒక ఎకరం పొలానికి బ్యాంకులు కేవలం రూ.20వేలు మాత్రమే ఇస్తారు. అంటే తెలంగాణలో చిన్న సన్న కారు రైతులే ఎనభై శాతం వుంటారు. వారికి మూడు గంటల పాటు కరంటు చాలు చెప్పిన, రేవంత్‌కు ఎకరం భూమి వున్న రైతుకు ఎంత రుణం అందుతుందో కూడా తెలియదు. అసలు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వారికే లేదు. రేవంత్‌ రెడ్డి మాటలు విని పదెకరాల భూమి వున్న రైతులు అప్పు చేస్తే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకుంటే తీర్చేవారు ఎవరు? ఇదిలా వుంటే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి ఆ మధ్య రెండు లక్షల రుణం గురించి పదే పదే చెప్పాడు. మరి ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ సభలో సోనియా నోటితో చెప్పించిన వాగ్ధానాలలో రెండు లక్షల రుణం ఊసెందుకు లేదు. అంటే అది సాధ్యం కాదని మాట మార్చారా? లేక రెండు లక్షల రుణం మాఫీ చేయడం సాద్యం కాదని వదిలేశారా? అన్ని వాగ్ధానాల కంటే ముందే రెండు లక్షల రుణం గురించి పదే పదే ఊదిన రేవంత్‌రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన పని వుంది.
తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి.
తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు, నియామకాల ప్రాతిపదికన జరగలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. కేవలం స్వేచ్ఛ కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని కితాబిచ్చాడు. మరి ఇంత కాలం నియామకాల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు పోరాటం చేసింది? ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ గర్జనలు ఎందుకు జరిగాయి? అంటే తెలంగాణ ఉద్యమంలో నియామకాలు కీలకం కాదంటే, భవిష్యత్తులో ఒక వేళ కాంగ్రెస్‌ వస్తే ఈ మాత్రం ఉద్యోగాలు కూడా ఇవ్వడం కుదరదని ముందే చెబుతున్నట్లు ప్రజల అర్ధం చేసుకోవాలో రేవంత్‌ వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. అసలు తెలంగాణ ఉద్యమం మీద ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నది లేదు. తెలంగాణ కోసం కోట్లాడిన వారి వైపు నిలిచింది లేదు. నిజాం సర్కారు నుంచి తెలంగాణ ఒకప్పుడు స్వేచ్ఛ కోరుకున్నది నిజం. అది కూడా స్వేచ్ఛ అంటే భూమి కోసం, భుక్తి కోసం, బాని సంకెళ్ల తుంచేసుకోవడం కోసం చేయడం జరిగింది. అంటే రాజరిక వ్యవస్ధలో భూస్వాములు పెత్తనంలో సామాన్య ప్రజలు నలిగిపోయి, తిరుబాటు చేశారు. అలా స్వేచ్ఛకోరుకున్నారు. కాని తెలంగాణ ఉద్యమం అన్నది ఆత్మ గౌరవం కోసం జరిగిన పోరాటం. ఆకలిపోరాటం. తెలంగాణ అస్తిత్వ పోరాటం. ఇక్కడ స్వేచ్ఛ అన్న దాని ప్రస్తావన లేదు. ఎందుకంటే మనం 1952లోనే ప్రజాస్వామ్యంలోవున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వాటంతటవే ప్రతి వ్యక్తికి అందుతున్నాయి. ఈ మాత్రంకూడా రేవంత్‌కు తెలియకపోవడం విడ్డూరం.
ఇక ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పధకాలు ప్రజలకు అందలేదా?
అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణకు అన్ని రకాల పథకాలు అందిన తర్వాత ఉద్యమం జరగడం తప్పన్న ధోరణిలో రేవంత్‌ వ్యాఖ్యలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోసీమాంధ్ర ప్రాజెక్టులు చకచకా నిర్మాణాలు ఎందుకు సాగాయన్నది రేవంత్‌ చెప్పాలి. మూడు వందల టిఎంసిల సామర్ధ్యంతో కట్టాల్సిన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టును సీమాంధ్ర పాలకులు 90 టిఎంసిలకే ఎందుకు కుదించారో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. పాలమూరు జిల్లాలో ఎన్నికల కోసం చెప్పి, అధికారం అనుభవించిన కాంగ్రెస్‌ ఫార్టీ నేతలు, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌ సాగర్‌, దిండి, రాజోలిబండ్‌ వంటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు. పాలమూరును ఎందుకు సస్యశ్యామలం చేయలేదు. ఎన్టీఆర్‌ హయాంలో చెన్నై కి మంచినీటిని తీసుకెళ్లారే గాని, తెలంగాణకు కనీసం మంచినీరు ఎందుకు ఇవ్వలేదు. నల్లగొండ ప్లోరైడ్‌ సమస్య ఎందుకు తీర్చలేదు? కృష్ణా నదీ జలాలను పూర్తిగా వినియోగించుకోకుండా, వరద జలాలు తెలంగాణకు, నికర జలాలు పోతిరెడ్డి పాడు ద్వారా ఎందుకు తరలించారు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో చిన్న నీటి పారుదల పేరుతోనైనా చెరువుల్లో కనీసం పూడికలెందుకు తీయలేదు. ఒట్టిపోతున్న చెరువులను ఎందుకు మమ్మత్తులు చేయించలేదు. ఒకప్పుడు గొలుసు కట్టు చెరువుల పేరుతో తెలంగాణను సస్యశ్యామం చేసిన చెరువులు విద్వంసానికి కారకులు ఎవరు? వైఎస్‌. హయాంలో రaంజావతీ లాంటి రబ్బరు డ్యామ్‌ పూర్తి చేసి, నీళ్లు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, తెలంగానలో ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు. కనీసం మూసీ ప్రాజెక్టుపై వున్న గేట్లు తుప్పు పట్టినా ఎందుకు బాగు చేయలేదు. ఆంద్రా ఎందుకు పచ్చగా వుండేది. తెలంగాణ ఎందుకు ఎండిపోయింది? పాలమూరు వలసలకు బాధ్యులెవరు? తెలంగాణలో కరంటు కోతలు, ఆంధ్రాలో కరంటు వెలుగులు నింపిందెవరు? ఖమ్మం జిల్లాలో తెలంగాణ వ్యక్తికి కనీసం నాలుగో తరగతి ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం మూలంగా 1969 ఉద్యమం మొదలైందన్న కనీస అవగాహన లేని రేవంత్‌ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం మీద మాట్లాడడం నిజంగా విడ్డూరమే…ఆయనకు తెలంగాణ అస్దిత్వం కన్నా, ఉమ్మడి పాలనలో పదవులు పొందడమే సులభం అన్న రాజకీయాలు చేయాలనుకుంటున్నారు! ఆత్మ ఆంధ్రాలో పెట్టి, తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నట్టున్నారు. అందుకే ఇలా ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్‌ను నిండా ముంచే పని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *