https://epaper.netidhatri.com/
` రేవంత్ రెడ్డి మతి లేని మాటలు.
`కరంటు మీద అవగాహన లేని లెక్కలు.
`సాగు మీద సంబంధం లేని సాకులు.
`ఆలయాల భూములమ్మి మైనారిటీలకు సాయపడతాడట.
`సమైక్య పాలనే బాగుందన్న రేవంత్.
`నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ట్యాగ్ లైన్ కాదట.
`సమైక్య పాలనలో నీళ్లిచ్చారట.
`అప్పుడే ఉద్యోగాలు బాగా ఇచ్చారట!
` తెలంగాణ నిధులతో హైదరాబాదు అభివృద్ధి చేశారట.
`ఉద్యమ ద్రోహి రేవంత్ నోట పచ్చి అబద్దాలు.
` అమరవీరుల త్యాగాలను అవమానించిన రేవంత్.
`తెలంగాణ ఉద్యమాన్నే తప్పు పడుతున్న రేవంత్.
`సమైక్య పాలకులు నీళ్లిస్తే పాలమూరు ఎందుకు ఎడారైంది?
`వలసల జిల్లాగా పాలమూరు ఎందుకు మిగిలింది.
`నమ్మితే తెలంగాణను ఆగం చేస్తాడు.
`చంద్రబాబు చేతిలో తెలంగాణ పెట్టి సమైక్య నినాదం వినిపిస్తాడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర రాజకీయాలను రేవంత్‌రెడ్డి పూర్తిగా కలుషితం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ వ్యవహారాన్ని అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇటు ప్రజలు చీ..అంటున్నారు. ఛీ..ఛీ..అంటున్నారు. అయినా రేవంత్‌కు అర్ధం కావడం లేదు. ఎంత గుడ్డెద్దు చేలోపడినట్లు వుంది ఆయన వ్యహారం. ఈ మధ్య నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడు. లాజిక్ లేని లెక్కలు చెబుతున్నాడు. అసలు లెక్కలు తప్పుతున్నాడు. జనాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని వీదినపడేస్తున్నాడు. తాను మాత్రమే కాంగ్రెస్ పార్టీలో అత్యంత గొప్పనాయకుడిని అన్న అపోహకు వచ్చేశాడు. అందుకే సీనియర్లను పక్కన పెట్టేశాడు. కాంగ్రెస్‌నిండా తెలుగుదేశం నింపేశాడు. ఇక ఆడిరది ఆట, పాడిరది పాట అనుకుంటున్నాడు. అన్నీ తప్పులే చేస్తున్నాడు. స్దాయికి మించి మాట్లాడుతున్నాడు. తాను పిసిసి అద్యక్షుడిని అన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. తన మాటల వల్ల పార్టీకి ఎంత నష్టం వస్తుందన్నది ఆలోచించడం లేదు. వ్యక్తిగతంగా తన ఇమేజ్ పెరుగుతుందన్న భ్రమలో వుంటున్నాడు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ మీద ఎలా పడితే అలా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నాడు. విరుచుకుపడుతున్నాన్న భ్రమ పడుతున్నాడు. మంత్రి కేటిఆర్ మీద ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. పైగా తనకు ఆ మాటలు కేసిఆరే నేర్పారంటూ పిచ్చి సూక్తులు చెబుతున్నాడు. సరే రాజకీయంగా ప్రత్యర్ధుల మీద మాటలు రాజకీయాలే అనుకుందాం..కాని ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నామన్న సోయి కూడా లేకుండా రేవంత్ మాట్లాడుతున్నాడు.
అమెరికాలో ఎకరాకు మూడు గంటల కరంటు చాలంటూ సోది చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు దానికి బాష్యం చెబుతున్నాడు.
ప్రతి రైతు 10హెచ్‌పి మోటార్ వాడితే ఎకరం పొలం మూడు గంటల్లో పారకమైపోతందంటున్నాడు. మెడ మీద తలకాయ వున్నవారెవరూ ఇలాంటి విధంగా ఆలోచన చేయరు. ఎందుకంటే తెలంగాణ కమతాలన్నీ చిన్న కమతాలు. ఆ కమతాలలో బావులకు సగం భూమి పోవడాన్ని ఎవరూ కోరుకోరు. గుంట స్ధలం కూడా వృధా పోకూడదని ఏ రైతైనా కోరుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు నిర్లక్ష్యం, కరువు పరిస్దితులు ఏర్పడడంతో భూగర్భ జలాలు పడిపోవడంతో బావులు ఎప్పుడో ఎండిపోయాయి. దాంతో చాల మంది రైతులు బావులను ఎంత పూడిక తీసుకున్నా నీటి జాడలు కనిపించలేదు. దాంతో రైతులు ఆర్ధికంగా నష్టపోయి, అప్పులపాలై వలసలు పోయిన సందర్బాలున్నాయి. ఆ అప్పులు తీర్చుకొని, మళ్లీ అప్పులు చేసి బోర్లు వేయించుకున్నారు. గత రెండు దశాబ్ధాలుగా తెలంగాణలో బోర్లమీదే వ్యవసాయం ఎక్కువ శాతం సాగుతోంది. బావులు ఎప్పుడో పూడుకుపోయాయి. చాల బావులు రైతులే పూడ్చేశారు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 26లక్షల బోర్ల కింద వ్యవసాయం సాగుతోంది. ఈ విషయం రేవంత్‌కు తెలిసినట్లు లేదు. 10 హెచ్‌పి మోటార్లు దేనికి అనుసందానం చేయాలో రేవంతే చెప్పాలి. అంతే కాదు బోర్లలో ఇంకా అంతటి సబ్ మెర్సిబుల్ మోటార్లు రాలేదు. వచ్చినా బోర్లు అందుకు సహకరించవు. ఈ మాత్రం పరిజ్ఞానం రేవంత్‌కు లేకపోవడం విడ్డూరం. కాదు దౌర్భాగ్యం. రేవంత్‌కు సాగు మీద కనీస అవగాహన లేదని తేలిపోయింది. తన అజ్ఞానం ఎంత గొప్పగా వుందో ఆయనే తెలియజేశాడు.
ఇక ఉమ్మడి రాష్ట్రంలోనే పాలన బాగుందని రేవంత్‌రెడ్డి కితాబిస్తున్నాడు.
నిజంగా రేవంత్‌రెడ్డికి ధైర్యం వుంటే తాను సమైక్యవాదిని అని ప్రకటించాలి. అవకాశవాదిగా ఎందుకున్నట్లు? ఇప్పటికీ తాను సమైక వాదానికి కట్టుబడి వున్నానని చెప్పదల్చుకున్నావా? అదైనా సూటిగా చెప్పు? ప్రజలే తేల్చుకుంటారు? తెలంగాణలో ఉమ్మడి పాలకుల పాలనే బాగుంటే పాలమూరు ఎందుకు ఎండిపోయింది? పాలమూరు ఇప్పుడు పచ్చబడిరదో కళ్లుండే చూస్తున్నావా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వలస జిల్లా అంటే ఉమ్మడి పాలమూరే అన్న సంగతైనా రేవంత్‌కు తెలుసా? రేవంత్‌ది అదే జిల్లానా? పాలమూరు మీద కవులు కొన్నివేల పాటలు రాశారు. కొన్ని వందల మంది గాయకులు పాలమూరు గాయాలు పాడి వినిపించారు. కొన్ని వందల మంది రచయితలు పాలమూరు కరువు మీద పుస్తకాలే రాశారు. ఇక జర్నలిస్టులు కొన్ని వేల వార్తలు రాశారు. పాలమూరు నుంచి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే బస్సులు ప్రచురించేవారు. అంతేందుకు పాలమూరు కరువు పారద్రోలుతానని చెప్పి,చంద్రబాబు దత్తతు తీసుకున్నాడు. కనీసం రేవంత్‌కు ఆ సందర్భమైనా గుర్తుందా? చంద్రబాబు దత్తత తీసుకొని ఏం బాగు చేశాడో రేవంత్ రెడ్డి చెప్పగలరా? తెలంగాణ గురించి మాట్లాడే ముందు రేవంత్ ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి. నిజంగానే ఉమ్మడి పాలకుల పాలన బాగుంటే తెలంగాణలో ఆది నుంచి ఎందుకు ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం ఎందుకు జరిగింది. తెలంగాన ప్రజలు తిన్నది అరక్క ఉద్యమం చేశారని రేవంత్ చెప్పదల్చుకున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో ఎంత మందికి తెలంగాణ నాయకులకు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం వచ్చింది? వచ్చినా వాళ్లు ఎందుకు పదవులు పోగొట్టుకోవాల్సివచ్చిందన్నది? రేవంత్‌కు తెలిసే మాట్లాడుతున్నాడా? దేశంలోనే గొప్ప పార్లమెంటేరియన్‌గా పేరు గాంచిన రేవంత్‌కు బంధువైనా జయపాల్‌రెడ్డి లాంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు? సమాధానం రేవంత్ చెప్పాల్సిన అవసరం వుంది.
ఉమ్మడి పాలకులు నీళ్లిచ్చారా?
అదే నిజమైతే కోనసీమ ఎందుకు పచ్చగా వుండేది. తెలంగాణ ఎందుకు ఎండిపోయేది? ఇప్పుడు కోససీమ కన్నా, తెలంగానలో ఎందుకు బంగారు పంటలు పండుతున్నాయి? ఉమ్యడి రాష్ట్రంలో తెలంగాణకు మంచినీళ్లు ఇవ్వని ఉమ్మడి పాలకులు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నిర్మించి, కాలువ ద్వారా మద్రాసుకు మంచినీళ్లు తీసుకెళ్లారన్న సంగతైనా రేవంత్‌కు తెలుసా? శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఎంత? ఆంద్రకు వాటా ఎంత? అన్నది రేవంత్ తెలుసుకున్నాడా? శ్రీశైలం కేవలం విద్యుత్ ఉత్పాదన కోసం కట్టిన ప్రాజెక్టే అన్నది తెలుసా? తెలంగాణకు శ్రీశైలం నుంచి వరద జలాలు మాత్రమే వినియోగం అన్న లెక్కలు చెప్పిన పాలకుల లెక్కలు రేవంత్ విన్నాడా? నాగార్జున సాగర్ ఎక్కడ నిర్మాణం చేయలి? ఎక్కుడ చేశారు? అన్నది రేవంత్‌కు తెలుసా? నాగార్జున సాగర్ నిర్మాణం చేసి, తెలంగాణకు ఖనిజ సంపద కూడా ఉపయోగపడకుండా కుట్ర చేసిన సందర్భం తెలుసా? కేవలం తెలంగాణను ముంచి, నీళ్లను తరలించుకుపోయేందుకు నాగార్జునసాగర్‌లో ఉమ్మడి పాలకులు చేసిన కుట్ర తెలుసా? ముందు ప్రకటించిన ప్రాంతం నుంచి తరలించి, వేరే ప్రాంతంలో నిర్మాణం చేశారని ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ వాదికి తెలుసు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం చేస్తే ఈ విషయం తెలిసేది.
మైనార్టీ డిక్లరేషన్ కోసం ఆలయభూములు అమ్మకానికి పెడతావా?
తెలంగాణలో కొన్ని శతాబ్దాల నుంచి ముస్లింలు, హిందువులు బాయి, బాయి అనుకుంటూ జీవిస్తున్నారు. రెండు మతాల సంస్కృతిలో మిలితమై బతుకుతున్నారు. ఒకరి పండుగలకు ఒకరు గౌరవించుకుంటూ సాగుతున్నారు. భాద్రాద్రి రామయ్యకు ముత్యాల వహరాలు నిజాం రాజు పంపించాడు. గంగాజమున తహజీవ్ కొనసాగుతోంది. పాతబస్తీలో బోనాల జాతర ఎంతో ఆనందోత్సహాలతో జరుగుతుంది. రంజాన్ నాడు హిందువులు, ముస్లింలు ఎంతో కలిసి వేడుక చేసుకుంటారు. అలాంటి వాతావరణాన్ని చెడగొట్టేందుకేనా సున్నితమైన విషయాలను రేవంత్ లేవనెత్తుతున్నాడా? ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసి, ఓట్లు చీల్చి ముస్లింఓట్లతో గద్దెనెక్కాలన్న రేవంత్ ఆలోచనను ఎవరూ సమర్థించరు. మైనార్టీలు కూడా ఇలాంటి రాజకీయాన్ని అసలే స్వాగతించరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనంతా కూర్యూలే! ఏ ఒక్కనాడు కర్ఫ్యూ లేకుండా వున్నదిలేదు. కాని ఈ తొమ్మిదేళ్లు ఎంతో ప్రశాంతంగా వుంది. కర్ఫ్యూ అన్న పదమే తెలంగాణ మర్చిపోయింది. ఆ ప్రశాంతతన చెడగొట్టేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నాడా? గతంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరువు, నగరంలో కర్ఫ్యూ ఇవే కదా? నిత్యం విన్నవి. చూసినవి. రేవంత్‌ను నమ్మితే భవిష్యత్తులో కూడా మళ్లీ ఇవే చూడాల్సివస్తుందేమో! ప్రజలు బాగా ఆలోచించుకోవాల్సిన అసవరం వుంది.