`కప్పదాటు మంత్రులను పీకేయండి?
`కఠిన నిర్ణయాలు తప్పవు..ఉపేక్షిస్తూ పోతే ఆగవు.

`తెలంగాణలో కాంగ్రెస్ కు రక్ష రేవంత్ రెడ్డి మాత్రమే.
`మొండిగా లేకుంటే నాయకులు మొదటికే మోసం తెచ్చేలా వున్నారు?
`అధికారంలో వున్నా కొందరు కోవర్టు గుణం మానుకోవడం లేదు!
`తాబేదార్ల పని వదులుకోవడం లేదు.
రేవంత్ కష్టపడి తెచ్చిన ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు.
`ప్రతిపక్షాలకు అస్త్రాలౌతున్నారు?
`అతి స్చేచ్ఛ ఎప్పటికీ హస్తవ్యస్తమే!
`కూర్చున్న కొమ్మనే నరుక్కుకుంటున్నారు.
`సీఎం. రేవంత్ రెడ్డి మంచి తనం అలుసుగా తీసుకుంటున్నారు.
`అందరిలో ఒకడిగా మెలుగుతుంటే మెతకవైఖరి అనుకుంటున్నారు?
`సీఎం. ను లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు?
`పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని కొందరు మంత్రులే దుర్వినియోగం చేస్తున్నారు?
’’సీఎం కుర్చీ మీద కన్నేసి’’ ప్రభుత్వాన్నే అస్థిర పరచాలని చూస్తున్నారు!
సీఎం. రేవంత్ రెడ్డి’’ ఉదాసీనత మితి మీరిన స్చేచ్ఛకు కారణం
`మంత్రులకు పూర్తి స్చేచ్ఛ కూడా కొంప ముంచుతుంది
`సీనియర్లు అనే గౌరవాన్ని చాలా మంది మంత్రులు నిలుపుకోవడం లేదు.
`‘‘సీఎం’’. రేవంత్ ను ఫెయిల్యూర్ ‘‘సిఎం’’గా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారా?
’’సీఎం’’. పై పదే పదే అధిష్టానం ముందు అబద్ధాలు ప్రచారం చేస్తూ వస్తున్నారా!
`గల్లీ లొల్లి..డిల్లీ పంచాయతి!
`కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత!
`ఎప్పుడూ మారనిదే ఇదంతా!
`ప్రతి చిన్న విషయానికి సిఎం.ను డిల్లీకి పిలవడం పార్టీకే నష్టం!
`జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా హై కమాండ్ జోక్యం చేసుకోవాలా?
`ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు వడపోసి పోయారు!
`ఇప్పుడు మళ్ళీ సీఎం, మంత్రులతో డిల్లీలో మంతనాలు!
`అధిష్టానం ‘‘సీఎం’’ను గౌరవిస్తే మంత్రులు భయంతో వుంటారు.
`అధిష్టానం మంత్రులకు ప్రాధాన్యతనిస్తే ‘‘మొదటికే మోసం’’ తెస్తారు
హైదరాబాద్, నేటిధాత్రి:
పాలనలో సామరస్యముండాలి. పరిపాలనలో మొండి తనముండాలి. ప్రజల విషయంలో ఆలోచనా దృక్పధం వుండాలి. పాలనా బాగస్వాములు పట్ల ముఖ్యమైన పాలకుడు కఠినంగానే వుండాలి. ఇది సిఎంలకు వుండాల్సిన అతి ముఖ్య లక్షణం. మెతక తనం కూడా కొన్ని సార్లు చేత కాని తనమౌతుందని అనుకునే పరిస్ధితి వుంటుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తర్వాతనైనా సరే ముఖ్యమైన పాకులు కఠినంగా వుండాల్సిన అవసరం వుంది. నిజం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులలో ప్రస్తుత సిఎం. రేవంత్ రెడ్డి లాంటి మంచి తనం నిండిన పాలకులు లేరు. ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఏ ఇతర శాఖల్లోనూ వేలు పెట్టడం లేదు. ఏ మంత్రిపట్ల ఇప్పటి వరకు సీరియస్‌గా వ్యవహరించలేదు. శాఖల నిర్వహణలో మంత్రులు అలసత్వం వహిస్తున్నా పెద్దగా మందలించిన దాఖలాలు లేవు. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనం. కాని అది సిఎం. రేవంత్ రెడ్డి చేతగాని తనంగా కొందరు మంత్రులు భావిస్తున్నట్లున్నారు. పైగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వున్న వాళ్లు కూడా కొంత మంది వున్నారు. ఎప్పుడు తమకు అవకాశం వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారు కూడా వున్నారు. ఈ విషయం సిఎం. రేవంత్‌రెడ్డికి తెలియంది కాదు. అయినా అలాంటి మంత్రుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఎంతో ఉదాసీనతతో వ్యవహిస్తున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రాదాన్యత కంటే ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కడా తాను ముఖ్యమంత్రి అనే దర్పం చూపించడం లేదు. ప్రతి విషయంలోనూ, సందర్భంలోనూ ఆయన మంత్రులను సమాన భాగస్వాములుగానే చూస్తున్నారు. వారికి మితిమీరిన మర్యాద కల్పిస్తున్నారు. ఇదంతా రేవంత్‌రెడ్డి గొప్పదనం. రాజకీయాల్లో అందరూ సమానమనుకునే మనస్తత్వం. ఇలాంటి ముఖ్యమంత్రులే సమస్యలు ఎదుర్కొంటారని అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి ఇంతగా మంత్రులకు స్వేచ్ఛ నిచ్చిన సందర్భాలులేవు. ప్రాంతీయపార్టీలలో సహజంగా సిఎంలు ఒకింత నియంతలుగా వుంటారన్న భావన వుంది. నిజం కూడా. ఆయా మంత్రులైనా, నాయకులైనా సరే ప్రతి విషయాన్ని తమకు తెలియకుండా ఏ ఒక్క ఫైలు ముందుకు కదలొద్దు అని హుకూం జారీ చేసేవారు. గత ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కేసిఆర్ పాలనలో కూడా అదే అనుసరించారు. గతంలో చంద్రబాబు పాలన కూడా అలాగే సాగింది. ఎన్టీఆర్ కాలంలోనూ సిఎం.కు తెలియకుండా చీమ చిటుక్కుమనలేదు. కాంగ్రెస్‌లో కూడా అదే జరిగింది. ఈ విషయాలను సిఎం. రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అయినా పాలన అంటే సమిష్టి బాద్యత అనే ఉదారస్వభావంతో సిఎం. రేవంత్ రెడ్డి వున్నారు. రేవంత్ అతి మంచితనం కూడా చెడుగా మారుతోంది. మంత్రులకు ఇచ్చిన అతి స్వేచ్చ దుర్వినియోగమౌతోంది. అంతిమంగా అది రేవంత్‌రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. దాంతో సిఎం. రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి కావాల్సి వస్తుంది. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని మళ్లీ అదికారంలోకి తీసుకురావాలి. ప్రజా పాలన సాగించాలని సిఎం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కాని చాల మంది మంత్రుల్లో ఈ అభిప్రాయం వున్నట్లు కనిపించడం లేదు. మళ్లీ అధికారంలోకి వస్తామో? లేదో? అనే అభద్రాతా భావంలోనే కొంత మంది మంత్రులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పదువుల్లో వున్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవడం, అవకాశంవస్తే సిఎం. కావాలన్న ఆశతో చాలా మంది వున్నారు. వారి వల్ల ఏమీ కాదన్న సంగతి ప్రజలకు తెలుసు. వారి వల్ల ఈ మాత్రం పాలన కూడా నడవదని తెలుసు. అయినా వారికి సిఎం కావాలన్న కోరిక రోజు రోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌రెడ్డి పదవిలో వుంటే తప్ప కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరు. సిఎం. రేవంత్‌కు ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా కాంగ్రెస్‌ను రక్షించే నాధుడే వుండరు. గత పదేళ్ల కాలంలో కనీసం పంచాయితీ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించలేని నాయకులు, రాష్ట్రానికి అధికారం తెస్తారని అనుకోవడం లేదు. అసలు వారికి పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో తెలుసు. సిఎం. రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఎంత శ్రమించాడో తెలుసు. పార్టీని నడిపేందుకు ఎంత ప్రయాసపడ్డాడో అందరికీ తెలుసు. పార్టీకి ఒక్కొ ఇటుక ఏలా పేర్చాడో తెలుసు. ప్రజల మనసు ఎలా చూరగొన్నాడో తెలుసు. పార్టీని నడపడమే చేతగాని కాడి పడేసిన వాళ్లు కూడా ఇప్పుడు పాలిస్తాం..ముఖ్యమంత్రి అవుతామని అని కలులు గంటున్నారు. ఈ విషయాలు అదిష్టానానికి తెలియక కాదు. కాని సిఎం.రేవంత్‌రెడ్డిని స్ట్రాంగ్ చేస్తే వైఎస్. రాజశేఖరెడ్డిలాగా మారుతాడేమో? అనే భయం అధిష్టానంలో కూడా వుంది. వారి మదిలో లేకపోయినా, నేర్పించే నాయకులు పార్టీలో చాల మంది వున్నారు. సిఎం. కవాలన్న ఆశ వున్నవాళ్లంతా ఇదే చేస్తున్నారు. వైఎస్‌కు అధిష్టానం పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లనే పార్టీకి తీరని నష్టం జరిగిందన్న అభిప్రాయం చాలా మందిలో వుంది. ఏపిలో పార్టీ నామ రూపాలు లేకుండాపోవడానికి కారణం అదే అని అధిష్టానానికి చెప్పిన వాళ్లున్నారు. అయితే వైఎస్ తర్వాత పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా సిఎం. రేవంత్‌లాగా ఉదాసీనతంగా వ్యవహరించలేదు. సిఎం. అంటే సిఎంలాగానే వ్యవహరించారు. ప్రభుత్వమంటే అందరూ సమానమే అయినా, సిఎం. ఎక్కువ సమానం అన్నట్లుగానే పాలన సాగించారు. రోశయ్య లాంటి వారు కూడా మంత్రుల మీద అజమాయిషీ చేశారు. అందర్నీ కట్టడి చేశారు. అసలు ఏ అనుభవం లేని కిరణ్‌కుమార్ రెడ్డి కూడా సిఎం. కాగానే తనేంటో చూపించారు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి? అనేంత ధైర్యంగా పాలన సాగించారు. అలా సిఎం. స్ట్రాంగ్‌గా వుంటే ఏ మంత్రులు నోరు మెదపరు. ఇప్పుడు సిఎం. రేవంత్‌రెడ్డి కూడా అలా వుంటే తప్ప మంత్రులు భయపడరు. వున్న ఈ మాత్రం పదవి కూడా సిఎం. కనికరంతోనే వుందన్న భయం మంత్రుల్లో ఖచ్చితంగా వుండాలి. తమకు పదవి రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. అధిష్టానం ఇచ్చింది అనే ఆలోచన వున్న కొందరు మంత్రులు సిఎం.ను లెక్క చేయడం లేదన్నది సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఆలోచన మంత్రుల్లో మారాలి. సిఎం. దృక్పధంలో కూడా మార్పు రావాలి. తాను మిగతా వారికన్నా ఎక్కువ సమానం అనుకుంటే తప్ప పరిస్ధితులు చక్కబడవు. తెలంగాణలో గతంలో వున్నట్లు పది జిల్లాలు కాదు. ఇప్పుడు 33 జిల్లాలు. అంటే వాటి పరిధి చాలా చిన్నది. గతంలో రెవిన్యూ డివిజన్ అంత కూడా ఇప్పుడు జిల్లాలు లేవు. అలాంటి జిల్లాల అధ్యక్షుల ఎంపిక కూడా అధిష్టానం నుంచి జరగాలంటే, ఇక్కడ సిఎంకు ప్రాధాన్యత ఎలా వుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సిఎంలు సూచించిన వారికి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పదవులు ఇచ్చిన సందర్బాలున్నాయి. అప్పుడంటే ఉమ్మడి జిల్లాలు కావడంతో పార్లీ పరంగా కొంత పలుకుబడి వుండేది. ఇప్పుడు పార్టీ పదవుల వల్ల వచ్చేది లేదు. ఆ నాయకులు ఒరిగేది లేదు. అయినా ఆ పదవులకు అంత ప్రాదాన్యత కల్పిస్తూ, సిఎంను పదే పదే డిల్లీకి పిలిచి సంప్రదింపులు జరపాల్సిన పనిలేదు. ఇక్కడే సిఎం. వారి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. మంత్రుల అభిప్రాయాలు, వారి ప్రాదాన్యతలు తీసుకొని ఎంపిక ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఇప్పటికే డిల్లీ నుంచి ప్రతినిధులు, పరిశీలలకు వచ్చారు. వడపోత పోశారు. కొంత మంది పేర్లు వాళ్లే ఫైనల్ చేశారు. ఇక ప్రకటనే తరువాయి. కాని దానిపై కూడా సిఎం.కు స్వేచ్చ నివ్వకుండా మళ్లీ అధిష్టానం వద్ద వడపోతలు చేయడం అంటే రాష్ట్ర నాయకత్వాన్ని అవమానించడమే అవుతుంది. సిఎం. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని తక్కువ చేయడమే అవుతుంది. పదేళ్ల తర్వాత, తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ఏ నాయకుడు అధికారంలోకి తీసుకురాలేకపోయారు. అందరూ సమిష్టిగా పనిచేయలేకపోయారు. కాని సిఎం. రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పడిన శ్రమలో చాల మంది నాయకులు పది శాతం కూడా పడలేదు. అలాంటి నాయకులు కూడా మంత్రులయ్యారు. ఇప్పుడు పాలనకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఒక్ససారి సిఎం. రేవంత్‌రెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తే, ఇప్పుడున్న అసమ్మతి మంత్రులంతా ఎందుకు దారిలోకి రారో చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో మంచి సంకేతాలు ఎందుకు వెళ్లవో గమనించండి. ప్రభుత్వానికి తలనొప్పులుగా మారుతున్న మంత్రులను పీకి పారేయండి. అంతే!!! దేవుడంటే భక్తి ఒక్కటే వుంటే సరిపోదు. భయం కూడా వుండాలి. సిఎం. అంటే మంత్రులకు భక్తి లేకపోయినా ఫరవాలేదు. భయం మాత్రం ఖచ్చితంగా వుండాలి. అప్పుడే పాలన గాడిలో సక్కగా నడిచేది.
