రెండో ఏడాదిలో హామీల అమలుపై ప్రధానంగా దృష్టి
అవినీతిపై ఉక్కుపాదం
ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం
చిత్రపురి కాలనీ సమస్యపై నజర్
పార్టీకి సుస్థిర నాయకత్వం అందించడంలో సక్సెస్
రేవంత్‌కే మద్దతిస్తున్న పార్టీ సీనియర్లు
హైదరాబాద్,నేటిధాత్రి:
డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లతో పోలిస్తే పాలనానుభవం పెద్దగా లేని రేవంత్ ఏవిధంగా ప్రభుత్వాన్ని నడుపుతాడన్న అనుమానాలు తొలినాళ్లలో వ్యక్తమైన మాట వాస్తవం. తెలంగాణ సమతుల్యాభివృద్ధి పేరు తో రేవంత్ రెడ్డి తన పాలనను మొదలుపెట్టి, సహజసిద్ధమైన దూకుడుతో, విపక్షాల దాడులను ఎదుర్కొంటూ, ఏడాదికాలంలో సమర్థ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఈ ఉత్సాహంతో ఆయన రెండో ఏడాది పాలననలో కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి అమలుకు ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, చి త్రపురి కాలనీ సమస్యతో పాటు వివిధ స్థాయిల్లో నెలకొన్న అవినీతి సమూల ప్రక్షాళనకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ఈదిశగా చేపట్టిన చర్యలను మరింత వేగవంతం చేసి, ప్రజ ల్లో మరింత విశ్వాసం పాదుకొల్పేందుకు అడుగులు ముందుకేస్తున్నారు.
అవినీతిపై ఉక్కుపాదం
ఇసుక తవ్వకాల్లో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఏవిధమైన లసుగులులేని నూతన ఇసుక విధానాన్ని రూపొందించాలని అధికార్లను ఆదేశించడమే కాదు, రూపొందించబోయే విధానం ప్రజల అవసరాలను తీర్చేదిగా, ప్రభుత్వానికి ఆదాయం లభించేదిగా వుండాలని గనులు మరియు భూగర్భ శాఖ అధికార్లకు ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరుతూ, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార్లను కోరారు. ఇదేసమయంలో హైదరాబాద్ నగర శివార్లలో వెలుస్తున్న అక్రమ స్టోన్ క్రషర్ల ను జప్తుచేయాలని, అటువంటి గ్రానైట్, క్వారీ కంపెనీలకు సంబంధించిన వివరాలు కూడా తనకు కావాలనికోరారు. మొత్తంమీద గనులు మరియు భూగర్భశాఖలో ప్రతి కార్యక్రమం పారదర్శకంగా వుండాలని స్పష్టం చేశారు. ఇటీవల విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు చెందిన అధికార్లను గట్టిగా హెచ్చరించారు. ‘హై డ్రా’ పేరుతో కొందరు అధికార్లు సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నట్టు వస్తున్న ఆ రోపణల నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు జారీచేయడం గమనార్హం. ఇదే సమయంలో వివిధ మైనింగ్, పరిశ్రమలు, మిల్లర్లనుంచి కొన్ని వేల కోట్లలో బకాయిలు వసూలు కావాల్సి వున్నా యి. వీటిని సత్వరమే వసూలు చేసి సంక్షేమ పథకాలకు ఖర్చుచేయాలని రేవంత్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది. ఒక్క మిల్లర్లనుంచే రూ.26వేల కోట్లు వసూలు కావాల్సి వుంది. ఈ మొత్తంతో రైతుభరోసా చెల్లించవచ్చు. వనరుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం ఈదిశగా కఠిన చర్యలకు ఉపక్రమించనుంది.
ఏసీబీ సమర్థపనితీరు
గత నాలుగేళ్ల కాలంలో ఏటా వంద కేసులు నమోదు చేసిన ఎ.సి.బి. 2024లో రేవంత్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలోనే 145 అవినీతి కేసులను నమో దు చేసింది. కాంగ్రెస్ పాలనా చరిత్రలోనే ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఇదే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 72 కేసుల్లో బాధ్యులైన 86మంది వ్యక్తులపై విచారణకు ప్రభుత్వం అనుమతించింది. గణాంకాల ప్రకారం ఈ సంఖ్య చాలా అధికం. ఇదే కాలంలో నమోదైన 145 రిజిస్టరయిన కేసులకు సంబంధించి 109 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వీరిలో అత్యధిక సం ఖ్యాకులు ప్రభుత్వ ఉద్యోగులు కాగా వీరిలో 30కిపైగా రెవెన్యూ అధికారులే వుండటం గమనా ర్హం. అదేవిధంగా అనినీతి పోలీసులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఎనిమిది నెలల కాలంలో ఏసీబీకి 1450 ఫిర్యాదుల అందడం, క్రమంగా వీటి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న 280మంది ఏసీబీ సిబ్బంది సరిపోవడంలేదని, వీరి సంఖ్యను 550కి పెంచాలని ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఏసీబీ పట్టుకున్న కేసుల్లో సగటు నేరనిరూపణ శాతం 55.55%గా వుంటోంది. దీన్ని 70%కు పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నది. పై గణాంకాలు పరిశీలిస్తే రేవంత్ ప్రభుత్వం అవినీతిపై ఏవిధంగా కఠినంగా వ్యవహరిస్తున్నదీ అర్థమవుతుంది. వచ్చే ఏడాది కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్లేం దుకే రేవంత్ కృతనిశ్చయంతో వున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 6న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన యాప్‌ను ప్రభుత్వం అంతకుముందు అందుబాటులోకి తెచ్చింది. పేదవారికి సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ముందుకెళుతున్నారు. పార్టీలు, ప్రాంతాలు అనే తేడాలేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను కే టాయించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. అయితే మహిళల పేరుమీదే ఇళ్లను కేటాయిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం లబ్దిదారులకు అందించే రూ.5లక్షలు నాలుగు విడతలుగా నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తుంది. బేస్‌మెంట్ లెవల్‌కు లక్ష, శ్లాబ్ లెవెల్ లక్ష, శ్లాబ్ పూర్తయ్యాక రెండు లక్షలు ప్రభుత్వం లబ్దిదారులకు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం కింద నిర్మించే ఇల్లు 400చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగది, టాయ్‌లెట్ సదుపాయం కలిగివుంటుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ వ్యవస్థ వుండగా ఇప్పుడు ప్రభుత్వం దాన్ని రద్దుచేసి లబ్దిదారులే ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇదే పథకం కింద జాగా లేనివారికి జాగాతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ప్రభుత్వం అందజేస్తుంది. డిసెంబర్ నెలాఖరునాటికితొలి విడతగా నియోజకవర్గా నికి 3500 నుంచి 4000 ఇళ్లు మంజూరు చేయనున్నారు. తొలివిడతలో తెల్లరేషన్ కార్డులు కలిగి సొంత జాగా వున్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేస్తారు. తెల్లరేషన్ కార్డు కలిగి అద్దెకు నివసించేవారు కూడా ఈ పథకం కింద అర్హులే. ఈవిధంగా119 నియోజకవర్గాల్లో తొలివిడతగా మొత్తం నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరవుతాయి. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అధ్యక్షతన కలెక్టర్ లబ్దిదారులను పేర్లను ఎంపిక చేస్తారు. గ్రామపంచాయతీ పరి మాణాన్ని బటి ఈ లబ్దిదారుల సంఖ్య వుంటుంది. లబ్దిదారుల జాబితాను గ్రామసభల్లో, పట్టణాలో అయితే వార్డు మీటింగ్‌ల్లో ప్రదర్శిస్తారు.
చిత్రపురి కాలనీ
చిత్రపురి కాలనీలోని కార్మికులకు కేటాయించిన 14 ఎకరాల్లో అక్రమంగా నిర్మించిన విల్లాలను,రోహౌజ్‌లను తొలగిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. పాలన రెండో ఏడులోకి అడుగిడుతున్న తరుణంలో రేవంత్ ప్రభుత్వం ఈ హామీని అమలు చేసేందుకు అడుగులు ముందుకేస్తున్నది. వేలమంది కార్మికులకు చెందాల్సిన భూముల్లో అక్రమంగా ధనం, రాజకీయ బలంతో ఉన్న పెద్దలు రోహౌజ్‌లు కట్టుకోవడం పెద్ద వివాదాన్ని సృష్టించింది. సొసైటీ పెద్దలు కూడా వీరితో కుమ్మక్కయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో వివాదం పెద్దస్థాయికి చేరింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ పెద్దలు, అక్రమంగా ఇళ్లు నిర్మించిన వారికే అండగా వుండటంతో కార్మికులకు న్యాయం జరగలేదు. అప్పట్లో విపక్షనేతగా వున్న రేవంత్ వీరి సమస్యను పరిష్కరిస్తానని హా మీ ఇచ్చారు. అదీకాకుండా చిత్రపురి కాలనీలో అక్రమాలపై ‘నేటిధాత్రి’ ఎప్పటికప్పుడు కథనాలను వెలుగులోకి తెచ్చి, కార్మికులకు అండగా అలుపెరుగని ‘అక్షర పోరాటం’ జరిపింది. ఫలితం గా రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడు అక్రమ నిర్మాణాలను కూల్చివేసినా, మిగిలిన వారు కోర్టుల్లో కేసులు వేయడంతో ప్రస్తుతానికి ఈ ప్రక్రియ ఆగింది. అయితే ఇక్కడ అక్రమంగా నిర్మించిన 225 విల్లాలకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే నోటీసులు జారీచేసింది. ఈ నిర్మాణాలు రెవెన్యూ (ఏఎస్‌ఎన్`3) శాఖ జారీచేసిన జి.ఒ. ఎం.ఎస్. నెం.658 నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం తన రెండో ఏడాది పాలనలో చిత్రపురి కాలనీ సమస్యను పరిష్కరించడానికే కృతనిశ్చయంతో వున్నారు. సినీ కార్మికులు రేవంత్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
ఏడాది పాలనలో సాధించిన విజయాలు
అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ మొట్టమొదట చేసిన పని తన ఇంటి పేరును ‘ప్రజాభవన్’గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం. ‘ప్రగతిభవన్’కు పరిమితమైన కె.సి.ఆర్. ప్రజలకు దూరమైన అనుభవం నేపథ్యంలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో కేవలం నలుగురు సభ్యుల మెజారిటీ మాత్రమే ఉన్నప్పటికీ ఆయన వెనుకాడలేదు. ముందుగా పార్టీలో అసమ్మతి రేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని, ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టారు. వీటిని అమలు చేయాలంటే ప్రభుత్వానికి మరో రూ.60వేలకోట్లు అవసరం.దీనికి తోడు అప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపడానికి వీల్లేదు. అప్పటికి రాష్ట్రం అప్పు రూ.7లక్షలకోట్లకు చేరుకోగా నెలసరి వడ్డీలకేరూ.6500కోట్లు కట్టాల్సిన పరిస్థితి. దీన్ని అధిగ మించాలంటే భగీరథయత్నం చేయాల్సిందే. అయినప్పటికీ వెనుకాడకుండా ఎక్కడికక్కడ పొదుపు పాటిస్తూ, వనరులను సమీకరిస్తూ, పాలనను కుంటుపడ కుండా సజావుగా సాగించడంలో రేవంత్ విజయవంతమయ్యారు.
గత ముఖ్యమంత్రులు వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి, కె.సి.ఆర్. వంటి నాయకుల మాదిరిగానే సొంత నియోజకవర్గంపై దృష్టిపెట్టి ‘కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ’ (కేఏడీఏ)ను ఏర్పాటు చేశారు. 65 ఐటీఐ కళాశలల అప్‌గ్రేడ్, నిజాం చక్కెర కర్మాగారం పునరుద్ధరణ, రాజేంద్రనగర్‌లో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి అనుమతులు మంజూరుచేశారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.7625కోట్ల రైతు భరోసా, క్విటాలు వరిధాన్యానికి రూ.500 బోనస్, రూ.10,444కోట్లు ఉచిత విద్యుత్‌కు, రూ.1433కోట్లు రైతు బీమా, రూ.95కోట్ల పంటల బీమా, వరిధాన్యం కొనుగోలుకు రూ.10547 కోట్లు వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన ఎన్నికల ప్రచారం లో హామీ ఇచ్చారు.. రూ. 54వేల కోట్లు ఖర్చు చేయడం ద్వారా రైతుల జీవితాల్లో పండుగ వా తావరణం తెచ్చామని రేవంత్ ఒకదశలో ప్రకటించారు. ఇచ్చిన హామీల్లో రైతులకు రూ.18వేల కోట్ల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం (రూ.3600కోట్లు), రూ.500 కే సిలిండర్ పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం వంటి కార్యక్రమాల ను అమలు చేసినా, రైతుభరోసా తదితర హామీలను అమలు పరచాల్సి వుంది. జంటనగరాల్లో ని చెరువులను కాపాడేందుకు, అక్రమ నిర్మాణాలను తొలగించే లక్ష్యంతో రేవంత్ ‘హైడ్రా’ను ఏ ర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ హైడ్రా, ఎన్ కన్వెన్షన్‌తో పాటు అనేకవిల్లాలు, అపార్ట్‌మెంట్‌లు తదితర అక్రమ నిర్మాణాలను సమర్థవంతంగా కూల్చివేసింది. ముఖ్యంగా అమీన్‌పూర్ చెరువు, అప్పా చెరువు, కిష్టారెడ్డిపేట్, సున్నం చెరువు, బుమ్‌రక్ దౌలా చెరువు, చింతల్ చెరువు, నందగిరి హిల్స్, కావూరీ హిల్స్ వంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇక మూసీ సుందరీకరణ ప్రక్రియలో భాగంగా, నదీ పరీవాహక ప్రాంతంలోని ర్మించిన ఇళ్ల కూల్చివేతను, భారాసా, బీజేపీ, ఎంఐఎంలు అవి పేదలవన్న సాకుతో అడ్డుకున్నా యి. చివరకు హైకోర్టు పేదలకు పునరావాసం కల్పించాలని నిర్దేశించిన మేరకు ప్రభుత్వం అంగీక రించడంతో అడ్డంకి తొలగిపోయింది. అయితే వికారాబాద్ జిల్లా దుడ్యాల్ మండలానికి చెందిన లగచర్ల వద్ద ఫార్మా సిటీ ఏర్పాటుకు స్థానికులు అంగీకరించకపోవడంతో పాటు అధికార్లపై దాడులకు దిగడంతో వివాదం చెలరేగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడ సేకరించే భూమి కేవలంపారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడానికేనని చెబుతోంది. దీని ఏర్పాటువల్ల వంద లాదిమందికిఉపాధి అవకాశాలు లభిస్తాయని హామీ ఇస్తోంది.