రేవంత్ రెడ్డి ఖబర్దార్..!

రాష్ట్రంలో తిరగనివ్వం.. ఖమ్మంలో అడ్డుకొని తీరుతాం
మున్నూరుకాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరావు
పొన్నాల లక్ష్మయ్య పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం

ఖమ్మం, అక్టోబర్ 14 : రాజకీయ కురువృద్ధుడు, హ్యాట్రిక్ తో పాటు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, 12 ఏళ్లు మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన బీసీ నేత, మున్నూరుకాపు సంఘ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను అగ్రకుల అహంకారంతో అవమానకరంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఖబర్దార్..! నీ వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పకపోతే నిన్ను రాష్ట్రంలో తిరగనివ్వం ఖమ్మంలో అడ్డుకొని తీరుతామని మున్నూరుకాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు హెచ్చరించారు. పొన్నాల లక్ష్మయ్యపై అగ్రకుల అహంకారి రేవంత్ రెడ్డి అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా శనివారం ఖమ్మం నగరంలోని మయూర్ సెంటర్లో మున్నూరుకాపు సంక్షేమ సంఘం జిల్లా కమిటీ, యువజన కమిటీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పార నాగేశ్వరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలను అగ్రకుల అహంకారంతో రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు అణిచివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఐక్యమైతే మీ స్థానం ఎక్కడో గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలకు, గడిలకు వ్యతిరేకంగా మున్నూరుకాపులు పోరాడారని గుర్తు చేశారు. మున్నూరుకాపులకు సముచిత స్థానం కల్పించి, సహకరిస్తే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. బిజెపి నుండి టిడిపికి, టిడిపి నుండి కాంగ్రెస్ కు మారిన రేవంత్ రెడ్డి నిజాయితీగా పనిచేసిన కాపులను అవమానపరంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, నిజాయితీపరుడుగా మంచి పేరున్న బండి సంజయ్ ను ఇదే అగ్రకుల అహంకారంతో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకుల అహంకారంతో బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, మున్నూరు కాపు సంఘం ఎఫెక్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నం వెంకటేశ్వరావు, మడ్డూరి పూర్ణచంద్రరావు, కార్పోరేటర్ రాపర్తి శరత్, మాజీ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు, పాల్వంచ రామారావు, గోళ్ళ వెంకట్, యువజన నాయకులు రాపర్తి రాజా, పారా ఉదయ్, పసుపులేటి వెంకట్, గోరెంట్ల రవి, ఆకుల సాయి, పాల్వంచ రాజేష్, నానబాల హరీష్, నాగసాయి శేఖర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!