`ఎవరు ఔనన్నా కాదన్నా సత్యమిదే!
`మూడేళ్ళు రేవంత్ పడిన కష్టం అందరికీ తెలిసిందే!

`పిసిసి. ప్రెసిడెంట్ అయ్యాక పార్టీకి పెరిగిన బలమే.
`పార్టీ కార్యకర్తల్లో రేవంత్ నింపిన నమ్మకమే.

`నాయకులకు కూడా రేవంత్ వల్లనే జనం ఆదరణ.
`పదేళ్ల ప్రతిపక్షంలో రేవంత్ ఒక్కడు జరిపిన పోరాటమే.
`ఏ ఇతర నాయకుడు రోడ్డెక్కింది లేదులే.
`కేసీఆర్ మీద తిరగబాటు చేసింది రేవంత్ ఒక్కడే.
`అడుగడుగునా కేసీఆర్ ను ఎదుర్కొన్నది రేవంతే.
`కేసీఆర్ పాలనలో అవినీతిని వెలికితీసింది ఆయనే.
`కేసీఆర్ ను ఎదిరించడానికి అందరూ భయపడిన వాళ్లే.
`కోవర్టులుగా ఆరోపణలు ఎదుర్కొన్నది చాలా మందే.
`ఇప్పుడు బీరాలు పలుకుతున్న వాళ్లంతా కేసీఆర్ టైంలో సైలెంటే.
`కేసీఆర్ మీద కన్నా రేవంత్ మీదే ఎక్కువ యుద్ధం చేసినవాళ్లే.
`రేవంత్ పిసిసి కాకుండా అడ్డుకున్న వాళ్లే.
`రేవంత్ ను ఆనాడు నెగలకుండా చేసిన వాళ్లే.
`అధికారంలోకి తెచ్చినా రేవంత్ సీఎం కాకుండా శత విధాల ప్రయత్నించిన వాళ్లే.
`ఇప్పటికీ సిఎం సీటు కోసం ఆశ పెట్టుకున్న వాళ్లు చాలా మందే.
`కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసి నిలిచింది రేవంతే.
`పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన ఘనత రేవంత్ దే!
హైదరాబాద్, నేటిధాత్రి:
అదికారంలో వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరూ హీరోలే. అదికారంలోకి తీసుకురావడానికి కష్టపడంలో మాత్రం అందరూ దూరమే. పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం వారికంటే పెద్ద నాయకులు లేరని అందరూ అనుకుంటారు. పార్టీ అధికారంలోకి వస్తే మేమే ముఖ్యమంత్రులంటారు. కాని అందరం కలిసి అదికారంలోకి తీసుకొద్దాం. కష్టపడదాం అనే ఆలోచనలు చేసే నాయకులు పెద్దగా కనిపించరు. అది ఆ పార్టీకి అలవాటైందో..లేక అదే సంస్కృతిగా మారిందో గాని, పార్టీ కోసం కష్టపడే నాయకులు మాత్రం పెద్దగా కనిపించరు. కాని పార్టీ అధికారంలో వున్నప్పుడు నిత్యం వివాదాలు సృష్టిస్తుంటారు. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు అలాగే విడివిడిగా వుంటారు. పార్టీ పదవులు కావాలనుకుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి. పదవి ఎవరిని వరిస్తుందో కూడా తెలిసే పరిస్దితి వుండేది కాదు. మాకు ఆ పదవి వద్దని చెప్పేవారు కూడా వుండేవారు కాదు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత తొలి పిసిసి అద్యక్షుడైన పొన్నాల లక్ష్మయ్య ఆ పదవి నిర్వహించడం నా వల్ల కాదు. పార్టీని నడపడం నాకు చేతగాదని వదిలేశారు. తర్వాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చేశారు. ఆయన కూడా 2018 ఎన్నికల దాకా పార్టీని నడిపాడు. తర్వాత ఆ పదవి నాకొద్దనుకున్నాడు. అప్పటికే రెండుసార్లు పార్టీ ఓడిపోయింది. ఇక పిపిసి అధ్యక్షుడు సమర్ధవంతమైన నాయకుడికి ఇవ్వాలని అదిష్టానం భావించింది. పిసిసి. పదవి ఇస్తే పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తానని సిఎం. రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. ఆ పని ఇతర నాయకులు ఎవరూ చేయలేదు. కాని పిపిసి అధ్యక్షుడు కావాలని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆశించారు. మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కోరుకున్నారు. వారిద్దరినీ కాదని అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఆ సమయంలో వి. హనుమంత రావు లాంటి నాయకుడు కూడా నేను అర్హుడిని కాదా? అంటూ ప్రశ్నించిన రోజులున్నాయి. ఇక రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడైన తర్వాత కాళ్లలో కట్టెలు పెట్టినట్లు అటు వెంకటరెడ్డి, ఇటు జగ్గారెడ్డి, వి. హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్ లాంటి వారు అనేక ప్రయత్నాలు చేశారు. పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని విఫల అద్యక్షుడుగా చేయాలని చూశారు. కాని అందరి ఊహలు పటా పంచెలు చేస్తూ రేవంత్ రెడ్డి దూసుకెళ్లారు. రేవంత్‌రెడ్డి పదవిని కొనుగోలు చేశారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు వెంకటరెడ్డి చేసిన సందర్భం వుంది. పిసిసి. అద్యక్షుడుగా రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన పెట్టుకున్నప్పుడు తనకు తెలియకుండా నల్లగొండకు ఎలా వస్తాడంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నల్లగొండకు రావాల్సిన అవసరం లేదు. ఆ జిల్లా నా సొంతం. అక్కడ ఏ రాజకీయమైనా తన కనుసన్నల్లో జరగాలన్నట్లు కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. రాజగోపాల్ రెడ్డి పిసిసి. అధ్యక్షుడుగా వున్న రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. పైగా ఆయన పార్టీకి రాజీనామా చేసి బిజేపిలో చేరారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ సమయంలో మంత్రి వెంకటరెడ్డి ఆస్ట్రేలియాలో వున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి నాయకులకు ఫోన్లు చేసి ఏం మాట్లాడారో కూడా పార్టీ నాయకులు తెలుసు. ఇదే దారిలో జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డి మెదక్ ఎలా వస్తారంటూ నిలదీసిన సందర్భం వుంది. మెదక్ జిల్లాకు వచ్చే ముందు నాకు సమాచారం ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు. పిపిసి. అధ్యక్షుడైతే కొమ్ములున్నాయా? అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయినా అందరిన్నీ కలుపుకుపోయి, ఎంతో సహనంతో పదవిని రేవంత్ రెడ్డి నిర్వహించారు. నిజానికి ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానాలు ఎంతో హుందాగా వుండేవి. తిట్టేవాళ్లుంతా నా వాళ్లే. వాళ్లంతా నాకు సోదరులే. అంటూ నవ్వుతూ రేవంత్ సమాధానమిచ్చేవారు. కొంత మంది నాయకులు ఎంత రెచ్చగొట్టాలని చూసినా ఏనాడు రేవంత్‌రెడ్డి తన అదుపు తప్పలేదు. అప్పటి బిఆర్ఎస్ నాయకులతోపాటు, సొంత పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని ఎంత డీమోరలైజ్ చేయాలని చూసినా ఏనాడు అదుపు తప్పలేదు. సొంత పార్టీ నేతలను ఏనాడు పల్లెత్తు మాట అనేలేదు. తన లక్ష్యం మాత్రమే చూసుకున్నాడు. పార్టీకి ఇచ్చిన హమీ మాత్రం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగారు. పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలన్నదానిపైనే దృష్టిపెట్టారు. పిపిసి. అధ్యక్షుడైన నుంచి మొదలు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాకా ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. పార్టీని నడపడం అంటే పాన్ డబ్బా నడిపినంత సులువు కాదని ఓసారి కేసిఆర్ అన్నాడు. అలాగే పిపిసి. పదవులు నిర్వహించడం తమ వల్ల కాదని వదిలేసిన వారి ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడు అయ్యే వరకు తెలంగాణలో కాంగ్రెస్ ఎంతో బలహీనంగా వుండేది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తన పదునైన వ్యూహాలతో ముందుకు సాగారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుస్తూ బిజేపి మంచి ఊపు మీద వున్నది. దానిని కాదని దాటుకుంటూ వెళ్లి, ప్రజల మన్ననలు పొంది, అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నం ఎంతో గొప్పది. అందుకే ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా పార్టీని అధికారంలోకి తసుకొచ్చింది మాత్రం ముమ్మాటికీ సిఎం. రేవంత్ రెడ్డి మాత్రమే. ఇక్కడ సమిష్టి కృషి అనే పదం ఇప్పటికీ రేవంత్ రెడ్డి తన హుందాతనాన్ని నిలుపుకోవడానికి చెబుతుంటారు. అంత కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా ఆయనను సిఎం. కాకుండా అడ్డుకోవడానికి శత విధాలుగా ప్రయత్నించిన నాయకులున్నారు. ఆఖరుకు అధిష్టానం ఆదేశాలతో మాత్రమే వాళ్లు చల్లబడ్డారు. పార్టీని ఎవరు అదికారంలోకి తీసుకొచ్చారో మాకు తెలుసు. అందులో ఎవరి కష్టం ఎంత వుందో తెలుసని తలంటిన తర్వాతే వారి వారి ప్రయత్నాలు విరమించుకున్నారు. రేవంత్ రెడ్డి సిఎం. కావడాన్ని అయిష్టంగానే అంగీకరించారు. అయినా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ సిఎం కావాలని కలలు కంటున్నవాళ్లు కూడా వున్నారు. ఈ విషయాలు అన్నీ తెలిసినా సిఎం. రేవంత్ రెడ్డి మౌనంగానే వుంటున్నారు. వారితో సఖ్యతతోనే వుంటున్నారు. తాను సిఎం. అనేది ఎక్కడా చూపించకుండా వారందరికీ ఎంతో మర్యాదను ఇస్తున్నారు. తనతో సమానంగా చూసుకుంటున్నారు. వారి వారి శాఖల్లో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాని వల్ల కూడా ఏం జరుగుతుందో సిఎం. రేవంత్‌రెడ్డికి తెలియంది కాదు. అయినా ఇప్పటి వరకు ఏ మంత్రిని కూడా మందలించింది లేదు. దాంతో సిఎం.రేవంత్ రెడ్డి తమను జోలికి రావడానికి భయపడుతున్నారన్న ఆలోచనలో కొంత మంది మంత్రులున్నట్లు కూడా పార్టీలో చెప్పుకుంటుంటారు. ప్రభుత్వాన్ని కొంత మంది మంత్రులు ఎలా అబాసుపాలు చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. ఏ ఏ మంత్రి మీద ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో తెలియంది కాదు. సరైన సమయం కోసం సిఎం. రేవంత్ రెడ్డి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాన్ని నిర్వహించడం, కాపాడుకోవడం, మళ్లీ పార్టీని అదికారంలోకి తీసుకురావడం అనేది కష్టపడేవారికి మాత్రమే తెలుస్తుంది.. పార్టీని ఎంత కష్టపడి అదికారంలోకి తీసుకొచ్చాడో సిఎం. రేవంత్ రెడ్డికి మాత్రమే తెలుసు. ఇతర మంత్రులలో ఎంత మంది పార్టీని భుజాల మీద వేసుకొని ముందుకు సాగారో జనానికి కూడా తెలుసు. అందుకే ఇప్పటికీ సిఎం. రేవంత్ రెడ్డి ఎంతో ఓపికతో వుంటున్నారు. ఈ మధ్య వివాదాలు అనేకం తలెత్తినా, ఆయన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు తలంటారే గాని, బైట ఏనాడు వారిపై నోరు విప్పలేదు. అదీ హుందాతనం అంటే..అదే స్ధానంలో ఇతర నాయకులెవ్వరున్నా ఈ పాటికి కంపు కంపు చేసేవారు. కాని రేవంత్ రెడ్డి ఎంతో హుందాగా, పదవి నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు పార్టీ హైకమాండ్ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆయనకు ఫ్రీ హాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. అప్పుడు అసలైన ఆట, రాజకీయం, పాలన రేవంత్ చూపిస్తాడని తెలుస్తోంది.
