ఏడుకేడు సీట్లు గెలిపించిన మొగోళ్ళు కేసీఆర్,కేటీఆర్……
ముఖ్యమంత్రి ఒక పెద్ద దద్దమ్మ…..
హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి…
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)
ముఖ్యమంత్రి పార్లమెంటు నియోజకవర్గం లోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకి ఏడు సీట్లు గెలిపించుకున్న మొగోళ్ళు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చి పోకూడదని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాదులోని తన కార్యాలయంలో మాట్లాదూతు ముఖ్యమంత్రి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని, కనీసం ఆయన పార్లమెంటు నియోజకవర్గం లో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయాడని అన్నారు.దీనినిబట్టి ఎవరు దద్దమ్మో చెప్పాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అధినేత కేసీఆర్ మీద నోటికి వచ్చినట్లు మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు మాట్లాడటం సరికాదని, ఇంకెన్ని రోజులు కెసిఆర్, కేటీఆర్
లను విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటారో చెప్పాలన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు.. అందులో ఉన్న 13 గ్యారంటీ లతోపాటు 420 హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. రేపో, ఎల్లుండో ముఖ్యమంత్రిగా ఆయన పని కధమైపోతుందని దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ వారేనని తెలిసి నిరాశ, నిస్పృహలకు లోనై చిల్లర మల్లన్న మాటలు మాట్లాడుతున్నవనే విషయం యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 39 సీట్లు కూడా కేసీఆర్, కేటీఆర్ వల్లే గెలిచామని,స్వంత పార్లమెంటులో పరిధిలో కనీసం ఒక్క సీటు కూడా గెలిపించలేదనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోకూడదు అని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చింది కూడా రేవంత్ రెడ్డి కృషితో కాదని ప్రజలు ఒక్కసారి మార్పు చూశారని,అతని వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి విర్ర వీగుతున్నడని విమర్శించారు.ఎవరికి అధికారం శాశ్వతం కాదని,ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంటే రేపు మళ్లీ తిరిగే అధికారం మా చేతిలోకి కూడా వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదని హెచ్చరించారు..