జడ్పిటిసి, గొర్రె సాగర్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ తమ స్వార్థ రాజకీయాల కోసం యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.మొన్నటి వరకు గ్రూప్ 2ను వాయిదా వేయాలని డిమాండ్ చేసిన వీళ్లే ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ యువతా, తస్మాత్ జాగ్రత్త.ఇలాంటి నీచ రాజకీయ నాయకుల కుట్రలకు, కుతంత్రాలకు తెలంగాణ యువత బలి కావొద్దు అన్నారు. తెలంగాణలో రాబోయేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని మళ్లీ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. యావత్తు దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.