సత్య వాది..నిత్య వాది రేవంత్‌ రెడ్డి.

-18 నెలలు ధరల పెరుగుదల లేకుండా పాలిస్తున్న ఏకైక సీఎం రేవంత్‌ రెడ్డి

-ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నిజమే చెబుతారు.

-యదార్ధ వాది లోక విరోధి..కానీ రేవంత్‌ ప్రజా సారధి.

-ప్రజల మేలు కోసం… తెలంగాణ వెలుగు కోసం రేవంత్‌ రెడ్డి.

-సంక్షేమ ప్రధాత, ప్రగతి విధాత రేవంత్‌ రెడ్డి.

-అబద్దాలు లేవు, ఆడంబరాలు లేవు.

-ప్రజా పాలనలో ప్రజా సంక్షేమం వెల్లివిరుస్తోంది.

-నిజాలు చెప్పడం మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

-ప్రజలను మభ్యపెట్టి రాజకీయం చేయడం లేదు.

-అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బైటపడేస్తున్నారు.

-వున్నదాంట్లోనే గొప్పగా పాలిస్తున్న పాలకుడు రేవంత్‌.

-పేదలకు సన్న బియ్యం అందిస్తున్న దేవుడు.

-పేదలకు సన్న బియ్యం అందిస్తున్న తొలి, ఏకైక రాష్ట్రం తెలంగాణ.

-ఎప్పటికప్పుడు ఉద్యోగ నియామకాలు వేగ వంతం చేస్తున్నారు.

-ఇప్పటికే 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు.

-స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు.

-యువత స్వయం ఉపాధి కోసం రాజీవ్‌ యువ వికాసం పథకం తెచ్చారు.

-రైతులకు ఏ రాష్ట్రంలో లేనంత మద్దతు ధర చెల్లిస్తున్నారు.

-పైగా సన్నాలకు బోనస్‌ కూడా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

-ఏక కాలంలో రైతులను రుణ విముక్తి చేశారు.

-తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఇందిరమ్మ ఇండ్లు.

-పదేళ్లుగా అందకుండా పోయిన వారికి కొత్త రేషన్‌ కార్డులు.

-అన్ని వర్గాల ప్రజల సంతోషం లక్ష్యంగా సాగుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజమైన పాలకుడు. పరిపాలనా దక్షుడు. గొప్ప పాలకుడు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే చరిత్రలో ఏ రాజు గురించి చెప్పుకోవాల్సి వచ్చినా, ఏ ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినా వారి పాలనలో ప్రజలు ఎలా వున్నారు అనేదే ప్రాతిపదిక. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో ప్రజలు సుఖశాంతులతోవున్నారు. సుబిక్షంగానే వున్నారు. అంతే కాదు గతంలో రాజులైనా, ప్రజా పాలకులైనా పన్నుల భారం లేని రాజ్యమే గొప్పది అని చెప్పుకునేవారు. అదే దారిలో నడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన కూడా అంతే గొప్పది. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ పాలన పోయి, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి సుమారు 18 నెలలు గడుస్తోంది. ఈ ప్రజా ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఎక్కడా ప్రజల తిరుగుబాటు జరిగింది లేదు. ప్రజా పోరాటాలు సాగింది లేదు. ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసింది లేదు. కేవలం సోషల్‌ మీడియా ప్రచారం తప్ప, ఏ ఒక్క వర్గం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెలెత్తి చూపించింది లేదు. తిరుగుబాటుకు తావే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ 18 నెలల కాలంలో ప్రజల మీద ఎలాంటి భారాలు వేయలేదు. చాటు మాటుగానైనా పన్నుల భారం మోపలేదు. ప్రజా శ్రేయస్సు కోరుకునే ఏ పాలకుడైనా ప్రజలను పీడిరచాలనుకోరు. ఇప్పుడు సిఎం.రేవంత్‌రెడ్డి కూడా అదే చేస్తున్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్దితి ఆయనకు బాగా తెలుసు. ప్రజల పరిస్దితి అంతకన్నా తెలుసు. ఇలాంటి పరిస్దితుల్లో పిండికొద్ది రొట్టె అనేలా పాలన సాగాలే తప్ప, ప్రజల ఇబ్బందులో వున్నప్పుడు బాదించకూడదనుకుంటున్నారు. పన్నుల భారం వేసి వేదించొద్దునుకుంటున్నారు. ఇంత కంటే గొప్ప పాలకుడు ఎవరూ వుండరు. పైగా గత నుంచి వస్తున్న సంక్షేమ కార్యాక్రమాలు ఎక్కడా ఆపడం లేదు. గత పాలకుల పథకాలను ఎక్కడా గండి కొట్టలేదు. వాటని యాదా తధంగా అమలు చేస్తున్నారు. వాటి అమలులో కూడా ఎక్కడా విమర్శలులేవు. గత పాలనలో ప్రజలకు అందుతున్న వృద్దాప్య పించన్లు అంతకన్నా మెరుగ్గానే అందుతున్నాయి. గతంలో కాస్త ఆలస్యమైన సందర్భాలున్నాయి. కాని రేవంత్‌రెడ్డి పాలనలో వృద్దాప్య పించన్లు గాని, ఇతర పించన్లకు ఎక్కడా ఇబ్బంది లేదు. ఆలస్యం కూడా ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. ఇక ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వ హాయాంలో నెలాఖరు వరకు కూడా కొన్ని శాఖలకు జీతాలు సరిగ్గా అందినసందర్భాలు చాలా తక్కువ. కాని ఇప్పుడు ఏ శాఖ ఉద్యోగులకైనా సరే ఒకటో తారీకే జీతాలు పడుతున్నాయి. గతమెంతో ఘనంగా చెప్పుకునే వాళ్లు ఉద్యోగులకు నెల నెల సకాలం జీతాలు చెల్లించిన పరిస్దితి లేదు. ఇక రైతుల విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. పైగా గతం కన్నా రైతులు సంతోషంగానే వున్నారు. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు నిర్విరామంగానే అందుతోంది. విమర్శలు ఎప్పుడూ వుంటాయి. రాజకీయ విమర్శలు పట్టించకోవాల్సిన అసవరం లేదు. నిజంగా రైతులకు ఇబ్బందులు వుంటే ఈపాటి రైతులు ఎప్పుడో రోడ్డెక్కెవారు. ఇక రైతు భరోసా కాస్త అటూ ఇటైనా సరే రైతులకు చేరుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం రైతు రుణమాఫీ. ఇది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పడంలో సందేహం లేదు. చెప్పిన సమయానికి రుణమాఫీ కాకపోవచ్చు కాని, మొత్తానికి ఏడాదిలో పూర్తి స్ధాయి రుణమాఫీ అందిరికీ జరిగింది. పై పెచ్చు రైతులకు బ్యాంకులు ఇచ్చే రుణాలు ఎక్కడా ఆగలేదు. ఏ రైతును బ్యాంకును ఇబ్బంది పెట్టింది లేదు. రైతులందరికీ బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చేశారు. రైతులకు పెట్టుబడి సాయాలు అందుకునేలా చూసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత మద్దతు ధర తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారు. ఇది ఏ రైతును అడిగినా చెబుతారు. గత పాలకులకన్నా ఎక్కువే ఇస్తున్నారు. వడ్లు ఎలా వున్నా ప్రభుత్వం సేకరిస్తూనే వుంది. తప్ప తేమ శాతం పేరుతో ఎక్కడా రైతులను ఇబ్బందులు పెట్టడం లేదు. అలాంటి వార్తలు ఎక్కడా లేవు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పూర్తి స్దాయిలో సేకరిస్తున్నారు. డబ్బులు కూడా రైతులకు వెంట వెంటనే అందజేస్తున్నారు. గతంలో రైతులకు డబ్బులు అందడంలో కొంత జాప్యం జరిగిన సందర్బాలున్నాయి. కాని రేవంత్‌ సర్కారులో ఎలాంటి జాప్యం లేదు. రైతుల నిరసన ఎక్కడా కనిపించలేదు. పైగా ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ఎక్కువ భాగం సన్నాలు పండిరచారు. గతంలో ఎప్పుడూ లేనంతగా రైతులంతా సన్నాలను పండిచేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం సన్నాలు పండిరచే రైతులకు ఇచ్చే బోనస్‌కు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. సన్నాలు పండిస్తున్నారు. గతంలో 2020లోనే రైతులను వరి వేయొద్దని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వడ్లు కొనుగోలు చేయమని హెచ్చరించింది. రైతులకు విత్తన వడ్లు అమ్మితే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా రైతులకు సన్నాలు పండిరచమని చెప్పి చేతులెత్తేశారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు తేడా లేకుండా చేసి రైతులను నష్టం కల్గించారు. తర్వాత వాణిజ్యపంటలు పండిరచాలని చెప్పి, వరి వేస్తే ఉరే అంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కాని రేవంత్‌ సర్కారు సన్నాలు పండిస్తే బోనస్‌ ఇస్తామన్నారు. ఇస్తున్నారు. తెలంగాణను సన్నాలు పండిరచే అన్న పూర్ణగా మార్చారు. అక్కడితో ఆగలేదు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మరో అడుగు ముందుకు పడిరది. ముఖ్యమంత్రి రేవంత్‌ సర్కారు రైతులు పండిచే సన్నాలను రేషన్‌ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్నారు. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన చర్య అని చెప్పాలి. తెలంగాణలో పేదలకు సన్నాలు అందించడం అనేది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం మొదలు పెట్టిన ఎన్టీఆర్‌ను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. తర్వాత ఎంత మంది పాలకులు అమలు చేసినా వారి పేరు చరిత్రలో నిలిచిపోలేదు. అలాగే పేదలకు మెరుగైన కార్పోరేట్‌ ఉచిత వైద్యం అందించిన రాజీవ్‌ ఆరోగ్య శ్రీ అనేది గొప్ప కార్యక్రమం. దానికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయన పేరు చిరస్దాయిగా ఈ పధకం ద్వారా నిలిచిపోతుంది. అలాగే పేద ప్రజలు ఉచితంగా సన్న బియ్యం అందించిన ఘనత మాత్రం సిఎం. రేవంత్‌రెడ్డికే దక్కుతుంది. పేద ప్రజలు రేషన్‌ ద్వారా సన్న బియ్యం తీసుకున్నంత కాలం రేవంత్‌ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక వేళ భవిష్యత్తులో ఏ పాలకుడైనా ఆ పధకానికి తూట్లు పొడవాలని చూసినా చరిత్ర క్షమించనంత గొప్పగా ఈ పథకం అమలుకు అనుములు రేవంత్‌ రెడ్డి రూపకల్పన చేశారు. పేదవారి కడుపు నింపుతున్నారు. రేవంత్‌ రెడ్డి పాలనలో గొప్ప కార్యక్రమం ఏమిటని చరిత్రను ప్రశ్నిస్తే చెప్పే గొప్ప కార్యక్రమం సన్న బియ్యం. పాలకులు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా, చరిత్ర మొత్తం చెప్పుకోవడంలో నిలిచిపోయేది ఒకటే వుంటుంది. అదే సన్న బియ్యం పధకం. గతంలో పేదలకు బియ్యం ఇస్తున్నామా? లేదా? అన్నట్లు వుండేది. కాని ఇప్పుడు సన్న బియ్యం సరఫరా ఒక గొప్ప విప్లవాత్మకమైన అడుగు అని చెప్పకతప్పదు. పైగా దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. తెలంగాణలో మాత్రమే మొదటి అడుగు పడిరది. అంతే కాకుండా రేపటి రోజు ఇతర రాష్ట్రాలలో సన్న బియ్యం అమలు కావాలన్నా తెలంగాణ నుంచే సన్న బియ్యం సరఫరా చేయాల్సి వుంటుంది. అలా తెలంగాణకు వరాన్ని, తన కీర్తిని ఏక కాలంలో పెంచుకున్న నాయకుడు రేవంత్‌ రెడ్డి. అన్నం ఉడికిందా? లేదా? తెలుసుకునేందుకు ఒక్క మెతుకు చాలు. రేవంత్‌ రెడ్డి పాలన గురించి చెప్పుకోవడానికి సన్న బియ్యం సరఫరా ఒక్కటి చాలు. నిజం చెప్పాలంటే రేవంత్‌ రెడ్డి పేదల పక్షపాతి. పల్లె నుంచి వచ్చిన నాయకుడు. ప్రజల జీవితాలు తెలిసిన నాయకుడు. ప్రజల బతుకులు బాగు చేయాలన్న లక్ష్యంతో రాజకీయం చేస్తున్న నాయకుడు. అందుకే తన 18 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలన సాగిస్తున్నారు. మరిన్ని మెరుగైన పధకాలు అమలు చేయాలని చూస్తున్నారు. ప్రజల చేత నిజమైన పాలకుడు అని అనిపించుకుంటున్నారు. ప్రజా పాలకుడుగా జేజేలు కొట్టించుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!