బడికి దూరమైన నెలలోపే బతుకు చాలించిన ఉపాధ్యాయులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: బడికి దూరమైన నెలలోపే ఓ
ఉపాధ్యాయురాలు బతుకు చాలించారు. సమాచారం తెలుసుకున్న ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. ఈ సంఘటనలో జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు వాస్కర్ నాగ స్వరూపరాణి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. గత డిసెంబర్ 31 వ తేదీన ఆమె పదవి విరమణ చేసారు. బడికి దూరమైన నెలలోపే గుండెపోటు రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను కబళించడం అందరిని కలచివేసింది. ఈ సంఘటన బడి, విద్యార్థులుతో ఆమెకున్న అనుబంధాన్ని సూచిస్తుందని తోటి ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన చివరి మార్గదర్శక ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన వైకల్యాన్ని ఎంత మాత్రం లెక్కచేయకుండా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి రాణించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులందరి మన్ననలు అందుకున్నారు.
