
R.S.I. Y. Narayana
17వ పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన
ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ
సిరిసిల్ల టౌన్ ( నేటి దాత్రి)
సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ కు చెందిన ఆర్.ఎస్.ఐ. శ్రీ వై. నారాయణ గారు 31-3-2025 రోజున 17వ బెటాలియనులో పదవి విరమణ పొందారు.1983వ బ్యాచ్ కి చెందిన ఇతను మొదట కానిస్టేబులుగా భర్తి అయ్యి 1993లో
హెడ్ కానిస్టేబుల్ గా, 2018లో ARSI, 2021లో RSI గా పదోన్నతులు పొంది.
41 సంవత్సరాల 4 నెలలు పోలీస్ వృత్తిలో విధులు నిర్వహించారు. ఇతను 2023 లో పోలీస్ పథకం అందుకున్నారు. ఈ సందర్భంగా 17వ బెటాలియన్ కమండెంట్ శ్రీ M.I. సురేష్ గారు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో సుదీర్ఘకాలంగా అంకితభావంతో పనిచేసి పదవి విరమణ చేస్తున్న ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ
గారికి అభినందనలు తెలియజేశారు. కర్తవ్యం నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగం చేసి శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో కుటుంబసభ్యుల బాధ్యత ఎంతో ఉంటుందని , రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందముగా గడపాలని సూచించారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని , వీలైతే సమాజసేవలో పాలు పంచుకోవాలన్నారు .రిటైర్ మెంట్ డబ్బును భవిష్యతు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలన్నారు. పోలిస్ శాఖ తరుపున అందాల్సిన ఇతర ప్రయోజనాలు అన్ని త్వరగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమండెంట్
శ్రీ సాంబశివరావు గారు ,RI & RSI లు మరియు బెటాలియన్ సిబంది పాల్గొని వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.