మబ్బులు తొలగిపోతున్నాయి…ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

సీఎం రేవంత్‌ రెడ్డి పట్టుదలకు హైడ్రా తార్కాణం.

కమిషనర్‌ రంగనాథ్‌ దూకుడు పెంచారు.

`హైడ్రాతో పర్యావరణ పరిరక్షణపై ఆశలు రేకెత్తుతున్నాయి.

`హైడ్రా పని తీరుపై సానుకూల వాతావరణం ఏర్పడుతోంది.

`హైడ్రాపై ప్రజల్లో మారుతున్న అభిప్రాయాలు.

`ఆరంభంలో అవాంతరాలు సహజం.

`ఎదురయ్యే తలనొప్పులు అధిగమించడమే విజయ మార్గం.

`ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెరకపోవడమే రేవంత్‌ వ్యక్తిత్వం.

`పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న పాలకుడు రేవంత్‌.

`ఎన్ని అవాంతరాలెదురైనా ఎదుర్కొంటున్నారు.

`ఎన్ని విమర్శలు ఎదురైనా దిగమింగుకుంటున్నారు.

`మంచిపని ఎప్పుడూ తప్పుకాదు.

`అంతిమంగా విజయం దక్కకపోదు.

`హైదరాబాదు పర్యావరణ పరిరక్షణలో మొదటి స్థానం దక్కకపోదు.

`పచ్చిన హైదరాబాదు సాధ్యం కాకుండా పోదు.

`రేవంత్‌ కల నెరవేరే తరుణం ఎంతో దూరంలో లేదు.

`జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీలో పేరున్న నాయకుడు పల్లం రాజు ఇల్లు కూల్చారు.

`జయభేరి అక్రమ అప్పార్టుమెంట్లు

`మొదట్లో కొన్ని ప్రశ్నలు.

`ఎన్‌ కన్వెన్షన్‌ తో జనంలో కేరింతలు.

`తర్వాత కొన్ని వివాదాలు.

`పేదల నుంచి కూడా విమర్శలు.

`ప్రజల నుంచి తిట్లు, శాపనార్థాలు!

`న్యాయ స్థానాలనుంచి కొన్ని అభ్యంతరాలు.

`ఇప్పుడు హైడ్రా మీద అన్ని వర్గాల నుంచి అభినందనలు

`ఏపి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అక్రమ కట్టడాలు నేల మట్టం చేశారు

`హైడ్రాకు ప్రత్యేక పోలీసు స్టేషను ఏర్పాటు చేశారు.

`సంబంధిత అధికారులకు వాహనాలు అందించారు

`మల్లారెడ్డి అక్రమ భవనాలు మటాష్‌

`అసదుద్దీన్‌ ఓవైసీ చెరువు కబ్జా కహానీ ఖతం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అబద్దాలు అందంగా వుంటాయి. నిజాలు లోతుగా వుంటాయి. అబద్దాలు తియ్యగా వుంటాయి. నిజాలు చేదుగా వుంటాయి. ఎందుకంటే నిజం నిప్పులాంటిది. నిజాలు తేలేందుకు కొంత సమయం పడుతుంది. అబద్దం నమ్మడానికి కొద్ది సమయమే తీసుకుంటుంది. హైడ్రా విషయంలో అదే జరిగింది. హైడ్రా వల్ల ఏదో జరిగిపోతోందన్న భావన ప్రతిపక్షాలు కల్పించాయి. హైడ్రా పెద్దోళ్లను ఒదిలిపెట్టి, పేదోళ్ల మీద పడిరదన్నారు. హైడ్రా పక్కదారి పట్టిందన్నారు. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కాని నిజం నిలకడ మీద తేలుతుందని బలంగా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైడ్రా విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా సహించారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కొన్నారు. ఏ విషయంలో సిఎం. స్పందించినా హైడ్రా మీద ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోలేదు. అంతిమంగా హైదరాబాద్‌కు మంచి జరగాలనుకున్నప్పుడు మౌనమే శరణ్యమని అనుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి ఎంతో పట్టుదల కలిగిన మనిషి. నిజంలాగా ఎంతో లోతైన నాయకుడు. ఏ విషయానైన్నానా సరే కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి నిజం వైపు నిలిచారు. రాజకీయ జీవితంలో ఎవరూ అందుకోలేని విజయాలు అందుకున్నారు. అందుకే ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా సరే ప్రజలకు మంచి జరుగుతుందనుకున్నప్పుడు ఎవరి మాట వినని సీతయ్యగా పేరు పొందారు. ప్రజల కోణంలోనే ఆయన ప్రతి విషయాన్ని చూస్తారు. ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరినైనా ఎదురిస్తారు. అందుకే సిఎం. రేవంత్‌ రెడ్డి ఎవరూ ఎదుర్కొనన్ని విమర్శలు ఎదుర్కొంటుంటారు. ఇంటా, బైట ఎంత మంది వేలెత్తి చూపినా పట్టించుకోరు. ప్రజలకు మరింత న్యాయం జరగాలనుకున్నప్పుడు కొంత ఓపిక అవసరం అనుకున్నారు. ఇప్పుడు హైడ్రా విషయంలో అదే చేస్తున్నారు. తాను హైడ్రాపై ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారో అవి నెరవేరుతున్నాయి. ఆయన కలలు సాకారమౌతున్నాయి. హైదరాబాద్‌కు మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చే దిశలు అడుగులు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే హైడ్రామీద మబ్బులు తొలగిపోతున్నాయి. ప్రజలు నిజాలు తెసుకుంటున్నారు. వాస్తవాలు పరిశీలిస్తున్నారు. మొన్నటి వరకు సామాన్యులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన ప్రతిపక్షాలను కూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు. హైడ్రా వల్ల ఎంత మేలు జరుగుతుందో కూడా కళ్లారా చూస్తున్నారు. ప్రజల నుంచి హైడ్రాకు ప్రశంసలు మొదలౌతున్నాయి. హైడ్రా వల్ల పర్యావరణ పరిరక్షణ అన్నది ఎలా సాద్యామౌతుందో కూడా కళ్లతో చూస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి, చెరువులు, కుంటలు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన వారి గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెత్తుతున్నాయి. అన్యాయం చేసిన వాళ్లే తమకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. గతంలో అయితే ఇలాంటి విషయాల్లో ఎంతో మంది దూరిపోయేవారు. కాని సిఎం. రేవంత్‌ రెడ్డి ఏదైనా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే చేస్తారు. పోకిరి సినిమాలు ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనేలా సిఎం. రేవంత్‌ ముందుకు సాగుతున్నారు. అందుకే అక్రమార్కులను ఎవరూ కాపాడలేకపోతున్నారు. తప్పు చేశామని ఒప్పుకునే పరిస్దితి తెచ్చుకుంటున్నారు. తమ అక్రమ నిర్మాణాలను కాపాడుకునే క్రమంలో కొంత మంది కోర్టులను కూడా ఆశ్రయిస్తూ స్టేలు తెచ్చుకునే ప్రయత్నాలు కూడా చేశారు. కాని వాటిపై న్యాయ పోరాటం కూడా హైడ్రా తరుపున కమీషనర్‌ రంగనాధ్‌ కూడా చాలా పట్టుదలతో చేస్తున్నారు. అలాంటి కేసులు వీగపోయేలా, కోర్టులు కూడా హైడ్రాకు అనుకూలంగా తీర్పులిచ్చేలా నిజాలను న్యాయ స్దానం ముందు వుంచుతున్నారు. దాంతో అక్రమార్కులు పప్పులు ఉడకడంలేదు. తప్పులు చేసిన వారికి న్యాయం స్దానాల్లో కూడా చుక్కెదురౌతోంది. వారి అక్రమ నిర్మాణాలు నేలమట్టమౌతున్నాయి. ఇప్పుడు మాత్రం హైడ్రా మీద పూర్తిగా సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. మొన్నటి వరకు ప్రజల్లో వున్న అనుమానాలు పటాపంచలైపోతున్నాయి. హైడ్రా వల్ల ప్రజలకు పూర్తి స్దాయిలో మంచి జరుగుతున్న నమ్మకం బలంగా వినిపిస్తోంది. అందుకే ప్రజలు హైడ్రాను ఆహ్వానిస్తున్నారు. అలా ఈ మధ్య కొన్ని కూల్చివేతల మూలంగా ఎంతో మంది ప్రజలకు మేలు జరగింది. ఏపికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్‌ ఏకంగా రోడ్డును కూడా కబ్జా చేసి, 49 ఎకరాలను ఆక్రమించుకున్నట్లు హైడ్రా తేల్చింది. వెంటనే అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసినా సరే, వాటిని కూడా పూర్తి స్దాయిలో నేల మట్టం చేసింది. ఆయన మూసేసిన రోడ్డును తెరిపించి, ప్రజలకు ఎంతో మేలు చేసింది. దాంతో ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, హైడ్రాకు కృతజ్ఞతలు తెలిజేశారు. ఇటీవల కూకట్‌ పల్లిలో కూడా పెద్ద భూ బాగోతం వెలుగులోకి విచ్చింది. ఓ వ్యక్తి, చెరువు స్థలాన్ని, ప్రభుత్వ భూమిని ఆక్రమించి, రియల్‌ వ్యాపారం సాగిస్తున్నారు. హైడ్రా రంగంలోకి దిగడంతో ఆయన బండారం బైట పడిరది. అక్కడ కూడా రోడ్డు మూయడంపై ప్రజలు ఎప్పటినుంచో అభ్యంతరం తెలియజేస్తున్నారు. కాని ఎవరూ పట్టించుకున్నది లేదు. ఇటీవల హైడ్రాకు ప్రత్యేకమైన పోలీస్‌ స్టేషన్‌ సిఎం. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. వారికి వాహనాలు అందించారు. అప్పటి నుంచి హైడ్రా కార్యాలయానికి ప్రజలు క్యూ కడుతున్నారు. భూ అక్రమాలపై పిర్యాదలు పెద్దఎత్తున అందజేస్తున్నారు. వివరాలు తీసుకున్న హైడ్రా వెంటనే రంగంలోకి దిగుతోంది. తాజాగా మేడ్చల్‌ జిల్లాలోని మేడిపల్లిలో ఓ ప్రైవేటు స్కూలు రోడ్డును ఆక్రమించి, భవనాలు నిర్మాణం చేసింది. దాన్ని ఎప్పటినుంచో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాని ఆ స్కూల్‌ యజమాని పట్టించుకోలేదు. రాజకీయ పలుబడితో అందర్నీ బెదిరిస్తూ వచ్చారు. దానిపై పిర్యాదు అందడంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా ఆ అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. రోడ్డు సౌకర్యం పునర్దురించింది. దాంతో ప్రజల్లో హర్షం వ్యక్తమౌతోంది. సహజంగా ఎంత మంచి పని చేపట్టినా అవాంతరాలు ఎదురు కావడం సహజం. వాటిని అధిగమించేందుకు కొంత సమయం పడుతుంది. వాటన్నింటినీ అధిగమించేందకు కొంత సమయం పట్టింది. ప్రజలకు నిజా, నిజాలు తెలియడంతో హైడ్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి విషయాలో ఆదిలో ఎన్నో ఒత్తిళ్లు సిఎం.రేవంత్‌రెడ్డికి వచ్చాయి. ఖైరతాబాద్‌ ఏమ్మెల్యే సైతం హైడ్రాను అడ్డుకున్నారు. హైడ్రాకు అడ్డంతిరిగారు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎవరినీ లెక్క చేయలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న సందర్భంలో మన, తర బేదాలు చూసుకోవద్దని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అంతెందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన, జాతీయ స్దాయిలో పార్టీ అధిష్టానానికి ఎంతో సన్నిహితుడైన నాయకుడి చెందిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. దాంతో పార్టీలో ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కాని సిఎం. రేవంత్‌రెడ్డి ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఆది నుంచి సిఎం. రేవంత్‌ ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా దిగిమింగుకున్నారు. మంచి పని ఎప్పుడూ తప్పు కాదని ముందుకు సాగారు. అంతిమంగా హైదరాబాద్‌ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్నారు. అంతిమంగా హైడ్రాకు విజయం దక్కకపోదన్న నమ్మకంతోనే రేవంత్‌ రెడ్డి వున్నారు. హైడ్రా అనుకున్న లక్ష్యాలు నెరవేరితే దేశంలోనే హైద్రాబాద్‌ పర్యావరణ పరిరక్షణలో మొదటి స్దానంలో వుంటుంది. గతంలో బెంగులూరు నగరాన్ని పర్యావరణ ప్రాంతంగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు హైదరాబాద్‌ను చెప్పుకునే రోజులు తప్పకుండా వస్తాయి. హైదరాబాద్‌ విషయంలో పర్యావరణ పరిక్షణ అంశంలో రేవంత్‌రెడ్డి కల నెరవేడానికి పెద్దగా సమయం కూడా పట్టేలా లేదు. ఆ తరుణం ఎంతో దూరం కూడా లేదు. ఎందుకంటే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చినప్పుడు ప్రజలు కేరిం తలు కొట్టారు. రాం నగర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చినప్పుడు కొంత మంది అడ్డుకున్నారు. మూసీ నదిలో అక్రమంగా ఇండ్లు కట్టుకొని వున్నవారిని తరలిస్తే రాజకీయం చేశారు. ఇప్పుడు వాళ్లందరికీ హైడ్రా పనితీరు పూర్తిగా అర్ధమైంది. హైడ్రాతో సుందరమైన, అందమైన నగరం మారుతుందన్న విశ్వాసం పెరిగింది. మూసీనది పరిరక్షణ, సుందరీకరణతో హైదరాబాద్‌ సరికొత్త సొగబులు దిద్దుకోవడానికి ఎంతో సమయం పట్టదు. దటీజ్‌ సిఎం. రేవంత్‌ రెడ్డి అని అందరూ కొనియాడే రోజు దగ్గర్లోనే వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!