ప్రభుత్వ ఉద్యోగాలలో క్రిడాకారులకు రిజర్వేషన్ కల్పించాలి

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎమ్మెల్యే కు వినతి

జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహిధర్

కొత్తగూడెం ఒలింపిక్ అసోసియేషన్ అద్వర్యం లో కొత్తగుడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు ప్రభుత్వ ఉద్యోగాలలో 2018 అప్పటి తెలంగాణ గవర్మెంట్ విడుదల చేసిన జి ఓ నెంబర్ 5 ప్రకారము ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ లలో క్రీడాకారులకు 2 % రిజర్వేషన్ కల్పించాలని ఆదేశించారు తరువాత జరిగిన నియామకాలలో ఫారెస్టు పంచాయితి రాజ్ వంటి కొన్ని ఉద్యోగాలలో క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని కానీ కొన్ని ప్రభుత్వ సింగరేణి వంటి సంస్థలు విస్మరించాయని దీని వలన క్రీడాకారులు నియామకాలలో చాలా నష్టం వాటిల్లుతుందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహిధర్ ఎమ్మెల్యే కు వివరించారు.కావున జి ఓ నంబర్ 5 ఖచ్చితముగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కొరారు.ఈ సందర్బముగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లడుతూ ఈ విషయం చీఫ్ సెక్రటరి సింగరేణి సీఎండీ కు లేఖలు రాసి వారితో మాట్లాడి క్రీడాకారులకు తగు న్యాయం చేస్తానని తెలిపారు .ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా చుంచుపల్లి మండల్ కౌన్సిల్ మెంబర్ ఎండీ బాబ్జి ,జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జాయంట్ సెక్రటరి డి.మల్లికార్జున ,వైస్ ప్రెశిడెంట్ ఎం.నరేశ్ ,జిల్లా బాస్కెట్ బాల్ సెక్రటరి ఇల్లుతూరి ప్రవీణ్ ,జిల్లా కరాటే అసోసియేషన్ సెక్రటరి ఈ .శ్రీదర్ ,జిల్లా యోగ సెక్రటరి గుమలాపురం సత్యనారయణ ,జిల్లా రెస్లింగ్ సెక్రటరి పి .కాసిం హుసేన్ ,జిల్లా టెక్ వన్దో సెక్రటరి ఈ .మొగిలి జిల్లా ఇండియన్ స్టయిలే రెస్లింగ్ సెక్రటరి బరిగెల భూపేష్ పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *