ఎన్ సిసి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు*
బాలాజీ టెక్నో స్కూల్ లో ఎన్.సి.సి. విద్యార్థుల ఎంపిక
నర్సంపేట,నేటిధాత్రి:
ఎన్.సి.సి విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందనీ, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఉంటాయని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్ లో గురువారం జరిగిన 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఎన్.సి.సి సెలక్షన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమానికి ఎన్ సిసి టెన్త్ బటాలియన్ ఆఫీసర్స్ హవల్దార్ విజయ్, దీపక్ లు మరియు బాలాజీ టెక్నో స్కూల్ ఎన్ సిసి థర్డ్ఆఫీసర్ ఎం.డి. రియాజుద్దీన్ ఆధ్వర్యంలో బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులకు సెలక్షన్స్ నిర్వహించారు. 185 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో నుండి 49 మంది విద్యార్థులను ఎన్.సి.సి. అధికారులు అర్హులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భవానీ చంద్, పార్వతి, వినోద్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.