#వినతులను సకాలంలో పరిష్కరించాలి*
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఆర్టిఐ యాక్ట్,ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరణపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
వివిధ సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సమర్పించిన వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో
ఆర్టిఐ యాక్ట్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతి,శాఖల వారిగా కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,చట్టం అమలు..ఎదురయ్యే సవాళ్లు చట్టాన్ని సమర్ధవంతంగా ఉపయోగించడం వంటి అంశాలపై కలెక్టర్ అధికారులకు కూలంకషంగా వివరించారు.పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో సరైన రూపంలో అందించాలని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత జవాబుదారీతనం పెంచడానికి ఆర్టీ ఐ చట్టం అమలు చేయడం జరుగుతున్నదని అన్నారు.ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షిస్తూ ప్రతివారం స్వీకరించిన సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఆ వారంలోనే ఖచ్చితంగా పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారి శాఖల ద్వారా అమలు చేసే కార్యాచరణ ప్రణాళిక వెంటనే సమర్పించాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.