పలు రైళ్లు నిలపాలని రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ కు వినతి….
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో కాజిపేట్ నుండి బల్లార్ష వరకు నడిచే పాస్ట్ ప్యాసింజర్,అండమాన్ -చెన్నై ఎక్స్ప్రెస్, కాగజనగర్ టూ తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లు రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేయాలని, రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలనీ మంచిర్యాల రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ కు బిజెపి సీనియర్ నాయకులు అరుముళ్ల పోశం ఆధ్వర్యంలో భాజపా నాయకులు మెమోరండం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్, బంగారి వేణుగోపాల్, శెట్టి రమేష్ లు పాల్గొన్నారు.