Workers Demand Safety Measures in Zaheerabad
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ప్రాంతంలోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఏరియా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ, పరిశ్రమల్లో కార్మికులు మరణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్యలపై తక్షణమే స్పందించి, కార్మికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు.
