జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో కౌన్సిలర్లు,బీ ఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ కు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రంఅందజేశారు.జమ్మికుంట పట్టణంలోని పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలువురు కౌన్సిలర్లు మరియు టిఆర్ఎస్ నాయకులు విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించుతూ నాయకులు ఏ సర్వే నెంబర్లలో కబ్జా చేశారో వాటి వివరాలతో కూడిన పత్రాలను మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ కు అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో అప్పటి ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహకారంతోనే భూ కబ్జాల వ్యవహారం జరిగిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలను వెంటనే మున్సిపాలిటీ అధికారులు తగు చర్యలు తీసుకొని వాటిని స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. గత పది సంవత్సరాల కాలంలో మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్న వారి హయాంలోనే కబ్జాలు అవినీతి అక్రమాలు జరిగాయని వాటి అన్నిటి పైన తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కమిషనర్ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకరి రమేష్, పూదరి శివ, సజ్జు, రేణుక, పర్లపల్లి నాగరాజు తోపాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.