మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు పై నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.నాయకులు మాట్లాడుతూ,ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే ఎంబిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం అవుతున్న యంబిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం అంటే ఇది బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అవుతుందనీ,ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎంబిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బిసి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్,అక్కల రమేష్,శాఖపూరి భీమ్ సేన్,పంపరి వేణుగోపాల్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.