
Bandi Sanjay Kumar
మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ నిధుల కోసం వినతి
కరీంనగర్, నేటిధాత్రి:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లోని వారి నివాసంలో గన్నేరువరం లక్ష్మీ నరసింహస్వామి మున్నూరు కాపు పటేల్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు బాలయ్య ఆధ్వర్యంలో కలిసి అసంపూర్తిగా ఉన్న సంఘ భవనం మరియు కాంపౌండ్ నిర్మాణానికి ఎంపీ ఫండ్స్ నుండి పది లక్షల రూపాయలను మంజూరు చేసి గన్నేరువరంలో ఉన్న రెండు వందల మున్నూరు కాపు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే నిధులు మంజూరు అయ్యేవిధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈకార్యక్రమంలో గన్నేరువరం మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు పుల్లెల రాము, నాయకులు పుల్లెల జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.