Jai Bhim Youth Celebrates Republic Day Grandly
జైభీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం
పరకాల,నేటిధాత్రి
వెల్లంపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జై భీమ్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో కజెండా పండుగ ఘనంగా నిర్వహించారు.అధ్యక్షులు బొట్ల అరుణ్ కుమార్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం వారు భారత రాజ్యాంగం, అంబేద్కర్ గురించి మరియు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.గ్రామంలోని అంగన్వాడి,ప్రాథమిక మరియు సెకండరీ పాఠశాలల విద్యార్థులకు వారి యొక్క యూత్ తరఫున ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సలహాదారు కాకి సతీష్, ఇంచార్జ్ కాకి శరత్ చంద్ర, యూత్ ఆర్గనైజర్ భవేష్, కార్యదర్శి మచ్చ టెనమ్, కోశాధికారి సుమంత్, సభ్యులు భవంత్,గ్రామ యువకులు మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం హాజరు కావడం జరిగింది.
