Immediate Repairs Needed for Mangapet–Eturunagaram Road
మంగపేట -ఏటునాగారం ప్రధాన రహదారికి మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి
బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి
మంగపేట నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినా కూడా మంత్రి సీతక్క ఏటూరునాగారం నుండి – మంగపేట కు వచ్చే ప్రతిసారి అదే రహదారి మీదుగా వస్తున్న కూడా ఆమె కంటికి రహదారిపై ఉన్న గుంతలు కనపడడం లేదా, మంత్రి అయి రెండు సంవత్సరాలైనా కూడా ఈ ప్రధాన రహదారులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు ములుగు నియోజకవర్గంలోని అతి పెద్ద మండలం అయినా మంగపేట మండలానికి జిల్లా కేంద్రానికి కలిపే ప్రధాన రహదారి ఇదే కావడం ఈ రహదారి వెంబడి ప్రజలందరూ జిల్లా కేంద్రంలోని మరియు వివిధ పనులకు గాని హాస్పటల్ కు వెళ్లేటప్పుడు ప్రజలు నరకయాతన పడుతున్నారు, ఈ గుంతలలో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడిపోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి అయినా కూడా మంత్రి సీతక్క అతిపెద్ద మండలానికి ఏకైక రహదారిగా ఉన్న ఈ రోడ్లు మరమ్మత్తులు చేయకపోవడం సరైన చర్య కాదు , నియోజకవర్గాన్ని విపరీతంగా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకుంటున్న మంత్రి కి ఈ రోడ్డు మీదుగా వస్తున్నా తనకు గుంతలు కనపడడం లేదా, అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకునే మంత్రి సీతక్క ఒక పెద్ద మండలన్ని జిల్లా కేంద్రానికి కలిపే అతి ప్రధానమైన రహదారిని మరమ్మతులు చేసే పరిస్థితి లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు, మీరు చేస్తున్న అభివృద్ధి ఎక్కడ ఉంది, అతి పెద్ద మండలాన్ని జిల్లా కేంద్రాన్ని కలిపే అతి ప్రధానమైన రహదారిని మరమ్మత్తులు చేయలేని మీరు ములుగు నియోజకవర్గన్ని అభివృద్ధి చేశామంటే అంటే ప్రజలు నమ్ముతారా?, మరో 20 రోజులలో ఆసియా ఖండంలో అతిపెద్ద మహా జాతర ప్రారంభం కాబోతున్న తరుణంలో, లక్షలాది మంది ప్రజలు, భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్, మరియు చత్తిస్గడ్ ఈ రహదారి మీదుగా లక్షలాది మంది భక్తులు ఆ తల్లుల దర్శనానికి వస్తుంటారు, ఇంత ప్రాధాన్యత కలిగిన రహదారునికి ఇప్పటివరకు మరమ్మత్తులు చేయకపోవడం అంక్షేపణ ( ఆశ్చర్యo), మహా జాతరకు 150 కోట్లు నిధులు మంజూరు చేశామని చెప్పుకునే మీరు పది కిలోమీటర్ల ప్రధాన రహదారికి మరమ్మతులు చేయకపోవడం సరైన చర్య కాదు,ఇప్పటికైనా మంత్రి సీతక్క స్పందించి మంగపేట మండల ప్రజల దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఈ రోడ్డును మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని, నిధులు మంజూరు అంటే రోడ్డు పాడైన అక్కడక్కడ రోడ్డు వేయడం కాదు , కమలాపురం నుండి ఏటురునాగరం వరకు ఒక లేయర్ బీట్ మంజూరు చేసి, నిధులు విడుదల చేసి వెంటనే పనులు చేపట్టాలి లేని పక్షంలో మంగపేట మండల ప్రజలతో కలిసి రోడ్డు మరమ్మత్తులు చేసే వరకు ఆందోళన చేయడానికి కూడా వెనకాడమని అన్నారు,
ఈ కార్యక్రమంమండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కోరెం సంతోష్,కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు , పప్పు వెంకట్ రెడ్డి చిలకమర్రి రాజేందర్, చీకుర్తి సుధాకర్, పబ్బోజు సత్యనారాయణ, గాదె శ్రీనివాస్ చారి , యాదండ్ల రాజయ్య,చల్లగురుగుల తిరుపతి, పగడాల వెంకట్ రెడ్డి , పంజాల సత్యం, గంగుల శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉడుగుల శ్రీనివాస్, మునిగేలా సాంబులు, సోషల్ మీడియా మండల ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, యూత్ నాయకులు ముప్పారాపు సందీప్ , కమలాపురం గ్రామ సోషల్ మీడియా ఇంచార్జ్ బీస సాంబయ్య, కొత్త మల్లూర్ గ్రామ సోషల్ ఇంచార్జ్ మునిగేలా నరేష్, తదితరులు పాల్గొన్నారు
