తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి:
యుద్ధ ప్రాతిపదికన చెరువుల మరమ్మతులు చేపడుతున్నామని నీటిపారుదల శాఖ ఎస్ ఈ ఆర్. సుధీర్ తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని వెలికట్ట గ్రామ ఊర చెరువు కరకట్ట బలహీనంగా ఉండి ప్రమాదకరంగా మారడంతో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
చేపట్టిన పనులను ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ల ఆదేశాల మేరకు మండలంలోని వెలికట్ట, మాటేడు, హరిపిరాల చెరువుల కరకట్టల తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ ఈ మాట్లాడుతూ….
చెరువు కరకట్ట బలంగా ఉంటే భూగర్భ జలాల వృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల చెరువుల కరకట్టలు బలహీనంగా మారితే వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని తెలిపారు. తొర్రూరు మండలంలోని వెలికట్ట, హరిపిరాల, మాటేడు గ్రామాల్లోని చెరువుల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు.
చెరువు కట్టలు తెగితే విలువైన నీరు వాగులు, వంకల పాలవుతుందని తెలిపారు.
చెరువు కట్టలను శాస్త్రీయంగా బలోపేతం చేస్తామని, చెరువులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయని, చెరువులు మత్తడి దూకుతూనే ఉన్నా.. ఎక్కడా కరకట్టకు ఇబ్బంది కలుగలేదన్నారు. దీంతో ఆయకట్టు రైతులు ఆనందంతో వ్యవసాయం చేసుకుంటూ దండిగా వరి ధాన్యాన్ని పండిస్తున్నారన్నారు.
మండలంలోని చెరువు కరకట్టల బలోపేతం కోసం శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఈ ఈ ఆర్ రమేష్ బాబు, డీ ఈ సునీల్ కుమార్, ఏ ఈ శ్రీనివాస రావు, కాంగ్రెస్ ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్, పార్టీ నాయకులు కొమ్ము సోమన్న, కొమ్ము ప్రభాకర్, లష్కర్ వెంకన్న, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.