
Corner Junctions.
మూల మలుపు ల వద్ద ముళ్ళ పొదలు, చెట్ల తొలగింపు
ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్స్టేషన్ పరిది లో మూల మలుపుల వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు, ముళ్ళ పొదలు అధికంగా పెరిగి మూల మలుపుల వద్ద రాకపోకలకు అంతరాయం కలుగుతు వాహనదారులకు వచేపోయే బండ్లు సరిగా కనబడక అక్సిడెంట్ లు అయ్యే ప్రమాదం ఉంది. కావున పోత్కపల్లి పోలీస్ ఎస్ ఐ డి. రమేష్, ఇందుర్తి, గూడెం గ్రామ మూల మలుపుల వద్ద గల ముళ్ళ పొదలను చెట్లను తొలగించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్ఐ అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ వాహన దారులు స్లో డ్రైవింగ్ చేయాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహన దారులు తప్పక హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు, అదే విధంగా మూల మలుపుల వద్ద, రోడ్ దాటేటప్పుడు ముందు వచ్చే వాహనాలను చూసి రోడ్డు దాటాలని అన్నారు.