కొడిమ్యాల (నేటి దాత్రి ):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామస్తులకు, వాహదారులకు విముక్తి కలిగింది. కొడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపం నుండి నాచుపల్లి వెళ్లే దారిలో ఏపుగా పెరిగిన ఏడాకుల పాల చెట్లు,వీటిని డెవిల్ ట్రీగా పిలువబడే ఈ చెట్లు పుష్పించి వీటి నుండి వెలువడే ఘాటైన వాసన పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు,కిడ్నీ జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, శరీరంపై దద్దుర్లు లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ చెట్ల నుంచి రాత్రి పూట వెదజల్లే ఘాటైన వాసనల వలన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు, వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా,స్పందించిన అధికారులు బుధవారం రోజున గ్రామపంచాయతీ సిబ్బందితో చెట్ల కొమ్మలను తొలగించారు.ఈ సందర్భంగా విషపూరిత చెట్లను తొలగించిన అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.