సికేపల్లిలో దళితుల స్మశాన ఆక్రమణలు తొలగింపు
రామచంద్రపురం(నేటి ధాత్రి)
మార్చి 01: తిరుపతి జిల్లా, రామచంద్రాపురం మండలం, చిట్టతూరు కాలేపల్లి రెవెన్యూ గ్రామంలోని చిట్టత్తూరు ఆది ఆంధ్ర వాడకు చెందిన స్మశాన వాటికను ఆక్రమణలను తొలగించి, దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేశారు. ఆర్ సి పురం తహసిల్దార్ కే వెంకటరమణ ఆదేశాల మేరకు
శనివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మండల సర్వేయర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సర్వేనెంబర్ 358 /13 సర్వే 00.38 సెంట్లు స్మశాన స్థలాన్ని గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఆక్రమించుకోవడంతో దళితవాడ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే నిర్వహించి ఆక్రమణలను వీఆర్వో వెంకటరమణ, నరసింహులు,జి రాజశేఖర్, బాబు, కమ్యూనిటీ సర్వేయర్ మణి, వీఆర్ఏ బాల, సుబ్రహ్మణ్యం, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి లు తొలగించారు. స్మశాన వాటిక చుట్టూ జెసిబి తో ఫ్రెంచ్ ఏర్పాటు ఏర్పాటుచేసి దళితులకు స్మశాన వాటిక సౌకర్యం కల్పించారు. స్మశాన వాటిక స్థలంలో మామిడి చెట్ల ఉన్నాయి.ఆ మామిడి చెట్లను కూడా గ్రామస్తులు ఉపయోగించుకునేలా రెవెన్యూ అధికారులు అప్పజెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లగా ఆక్రమణకు గురైన స్మశాన వాటిక ఏర్పాటు చేసినందుకు గ్రామానికి చెందిన దళితులు అధికారులకు, కృతజ్ఞతలు తెలిపారు..