Relief Demanded for Silkworm Farmers
నష్ట పోయిన దసలి పట్టు పురుగుల పెంపక దారులను ప్రభుత్వం ఆదుకోవాలి :బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ
మహాదేవపూర్ నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహాదేవపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ నెత్రుత్వంలో ఈరోజు మహాదేవపూర్ పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో సాగుచేస్తున్నటువంటి పట్టు పురుగుల పెంపక దారులు నష్ట పోయిన తోటలను బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ సందర్శించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన సుమారు 100 కుటుంబలకు చెందిన పేదవారు ఈయొక్క దసలి పట్టు పురుగుల పెంపకం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు, అయితే గత నెలలో కురిసిన వర్షలకు,వాతావరణ మార్పుల కారణంగా వైరస్ వ్యాప్తి చెంది,కాయ పొసే దశలో చనిపోవడం జరిగిందని,దసలి పంటపై ఆధారపడి జీవించే వీళ్ళు ఆర్థికంగా కుటుంబానికి 1లక్ష నుండి 2 లక్షల వరకు నష్ట పోయారని,ప్రభుత్వం వెంటనే వీరికి కుటుంబానికి 50,000 చొప్పున నష్ట పరిహారం అందిచలని,వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్గించాలని, అలాగే దసలి గుడ్లు కూడా ఫ్రీగా ఇవ్వాలని,అలాగే పట్టు పరిశ్రమ శాఖ లో ఉన్నటువంటి 500 పైగా ఉద్యోగలను పట్టు పురుగుల పెంపకం దారుల కుటుంబాల పిల్లలకు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్,మండల ప్రధాన కార్యదర్శులు, బల్ల శ్రావణ్ కుమార్, లింగంపల్లి వంశీ,కోశాధికారి ఉదారి పూర్ణచందర్ బీజేపీ మండల నాయకులు,కన్నెబోయిన ఐలయ్య, చాగర్ల రవీందర్,దాడిగేలా వెంకటేష్, కొక్కు రాకేష్,పోషయ్య, రాకేష్,దసలి పట్టు రైతులు పాల్గొన్నారు
