
PM Kisan Samman Nidhi.
పి ఏం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడుత నిధుల విడుదల.
కాశిబుగ్గ నేటిధాత్రి
రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద 20వ విడత నిధులుశనివారం రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతు ఖాతా లోకి నేరుగా విడుదల ఈ సందర్భంగా దేశ రైతుంగాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమం రైతు వేదికలోని వీసీ యూనిట్ లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి ఎస్సి కార్పొరేషన్ ఈ డి సురేష్ కుమార్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మండలంలో 7079 మంది రైతులకు కిసాన్ సన్ నిధి క్రింద ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.6000 మూడు విడుతలలో,ఒక విడుతకు రూ.2000 చొప్పున లబ్ది చేకూరుతుందన్నారు.
⏩ అనంతరం ఏ వో హరిప్రసాద్ మాట్లాడుతూ మండలంలో ఇంకా 573 మంది రైతులు ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉందని,929 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు.వెంటనే
పెండింగ్ ఉన్న రైతులు అట్టి పనులు వెంటనే పూర్తి చేసుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ది పొందాలని కోరుతున్నాము.
అంతకుముందు గంగదేవి పల్లి గ్రామంలో ఏరువాక సాగుబడి రైతు అవగాహన కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏవో హరిప్రసాద్ మాట్లాడుతూ రైతులు ప్రస్తుతం పత్తి పంటలు తెలుసుకోవలసిన జాగ్రత్తల నుంచి అవగాహన కల్పించడం జరిగింది. రైతులు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేసుకోవాలని పురుగు మందులతో కలిపి చల్లకూడదని తెలిపారు.రసం పీల్చే పురుగుల ఉధృతిని తెలుసుకోవడానికి జిగురు అట్టలను వాడాలని,ఎసిఫేట్, మోనోక్రోటోఫాస్ మందులను ఎట్టి పరిస్థితుల్లో కలిపి వాడరాదని,పంట తొలి దశలో నీమ్ ఆయిల్ ను విస్తృతంగా వాడాలని సూచించారు.నానో ఏరియా నానో డిఏపి ఎరువులను వాడడం వల్ల 80 నుంచి 90 శాతం నత్రజని ఎరువు మొక్కకు అందుతుందన్నారు. మొక్కలపై ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే పురుగు మందుల పిచికారి చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గీసుకొండ ఏఈఓ రజిని,ధర్మారం ఏఈవో కావ్య,కూసం రాజమౌళి మరియు రైతులు పాల్గొన్నారు.
పి. హరి ప్రసాద్ బాబు
మండల వ్యవసాయ అధికారి
గీసుగొండ.