మంచిర్యాల నేటిదాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ముందు కార్మికుల హక్కుల సాధన కోసం, భారతీయ మజ్దూర్ సంఘ్ (బి.ఎం.ఎస్) ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. అందులో భాగంగానే నేటితో 48 వ రోజుకు చేరిన నిరాహార దీక్ష, స్పందించని యాజమాన్యం, పట్టించుకోని ప్రభుత్వం, అదేవిధంగా కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 16నెలలు కావస్తున్న, కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యాజమాని మల్కా కొమరయ్య గారు మొండిగా వ్యవహరిస్తున్నారు, ఇప్పటికైనా కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటం పై, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి కార్మిక చట్టం ప్రకారం రావలసిన బెనిఫిట్స్ ఇప్పించే విధంగా కృషి చేయవలసిందిగా కోరుచున్నాము. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము.ఈ యొక్క కార్యక్రమంలో పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్,ఉపాధ్యక్షులు సగ్గుర్తి ఆనందరావు, కర్నే రాజన్న,మానెం శ్రీశైలం,ఇసారపు శంకర్,గెల్లు ఎల్లయ్య,కార్మికులు పాల్గొన్నారు