
Financial Aid to RMP Family
ఆర్ఎంపీ కి ఆర్థిక సహాయం
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి దాసరి జయసాగర్ తల్లి ఈశ్వరమ్మ (85) శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా ఆర్ఎంపి,పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నడికూడ మండల కమిటీ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,మనోధైర్యం కల్పించి,మండల కమిటీ తరపున రూ.5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మండల అధ్యక్షుడు పాశికంటి రమేష్, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి రాజేందర్,మార్త సురేష్, అడిగిచర్ల అశోక్,మంద సురేష్,తదితరులు పాల్గొన్నారు.