# ఏఐఎఫ్డిఎస్ నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి మార్తా నాగరాజు.
నర్సంపేట,నేటిధాత్రి :
చదువుల పేరుతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూల్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఏఐఎఫ్డిఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మమార్తా నాగరాజు అన్నారు.ఏఐఎఫ్డిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ నర్సంపేట ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలోతొక్కుతూ ఇష్టానుసారంగా అధిక పీజులకు పాల్పడుతూ, యూనిఫామ్స్ అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. పర్మిషన్లు లేకుండా సమ్మర్ క్లాస్ ల పేరుతో పాఠశాలలో మార్కుల శాతం రాకున్న ఎక్కువగా వచ్చినట్లు కలపత్రాలు తయారుచేసి గ్రామాలలో పంచుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న బిట్స్ పాఠశాలలు,
శ్రీ చైతన్య టెక్నో స్కూల్,మంటిస్సోరి, డఫోడిల్స్,మదర్స్ లాండ్ స్కూల్,విజ్ డమ్ హై స్కూల్ లతో పాటు పలు ప్రైవేట్ స్కూల్ లపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ అధికారులు ఏమాత్రం కనీసం స్పందించకపోవడం వలన మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు మా ఇష్టం అన్నట్లుగా ఫీజులు వసూలు చేస్తామని యాజమాన్యాలు బదాయిస్తున్నయని నాగరాజు ఆరోపించారు. జీవో నెంబర్ 46 తుంగలో తొక్కుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్న ఉన్నత విద్యా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వంశీ, ఈశ్వర్, రాకేష్, బన్నీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ విద్యసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి