Students Slam KU Registrar for Neglecting Education
విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టని రిజిస్ట్రార్
#స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు : ఎల్తూరి సాయికుమార్
హన్మకొండ, నేటిధాత్రి:
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ సమావేశంలో మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నాన్ బోర్డర్ల మీద పెట్టిన దృష్టి విద్యావ్యవస్థ మీద ఎందుకు పెట్టడం లేదు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు డిటెన్షన్ పద్ధతిని ఎత్తివేయాలని, అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించాలని, సరైన టైంలో రిజల్ట్స్ ఇవ్వాలని ,ఫార్మసీ విద్యార్థులకు డిటెన్షన్ పద్ధతి ఎత్తివేయాలని వేలాది మంది విద్యార్థులతో గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పట్టించుకోకుండా ఎటువంటి సర్కులర్లు జీవోలు తీయకుండా కాలయాపన చేసిన కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఈరోజు అత్యవసరంగా సర్కులర్లు తీస్తూ విద్యార్థులకు ఉపయోగపడని అంశాలపై అర్థరాత్రి జీవోలు సృష్టిస్తున్న యూనివర్సిటీ అధికారులు.ప్రశ్నిస్తున్న విద్యార్థులపై ఉక్కు పాదం మోపుతున్న యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా డిపార్ట్మెంట్లో సరిపడా ప్రొఫెసర్ లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురైన కూడా పట్టించుకోని అధికారులు,కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీలో మహిళ మూత్రశాలలో నీళ్లు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురైన ఏ రోజు కూడా స్పందించని అధికారులు ఉపయోగపడని అంశాలపై అతి తొందర్లో స్పందిస్తూ అర్థరాత్రిలో జీవోలు తీస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసే ప్రక్రియ యూనివర్సిటీలో జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ అన్నిటికి పరిష్కారం చూపాలని కోరుతున్నాం.నిన్న కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో కుళ్ళిపోయిన టమాటాలు పుచ్చిపోయిన బీరకాయలు వచ్చాయని విద్యార్థులు ఆందోళనకు గురికావడం కూడా జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ అంశంపై స్పందించకుండా విద్యార్థులపై ఉక్కు పాదం మోపుతూ ఆ విద్యార్థుల డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి లతో చెప్పి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే ప్రక్రియ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ స్వేరో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు మోజెస్, చెట్టుపల్లి శివకుమార్, విష్ణు, ఆనంద్, భాస్కర్, సతీష్, సుఖేష్, అవినాష్ , శ్రావణ్, అజయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
