
ప్రాంతీయ రాజకీయాలకు రానున్న కాలం అనుకూలం కాకపోవచ్చు
దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి కొనసాగుతున్న వలసలే ఇందుకు కారణం
వలసలవల్ల ఎక్కువ భాషలపై పట్టు స్థానికులకు ఎంతో ప్రయోజనకరం
దేశవ్యాప్తంగా ప్రజల అనుసంధానతకు దోహదం
అవసరాల రీత్యా పంథాను
మార్చుకుంటేనే పార్టీలకు మనుగడ
డెస్క్,నేటిధాత్రి:
మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ప్రాంతీయ పార్టీలు రెచ్చగొడుతున్న ప్రాంతీయభాషాభిమానం రానురాను వికృతరూపం దాల్చి, తీవ్రస్థాయి భాషా ద్వేషాలకు దారితీసే ప్రమాదం ఏర్పడుతోంది. దేశ సమైక్యతను దెబ్బతీసేవిధంగా, ప్రాంతీయ దురభిమానాలను రెచ్చగొట్టి ఓట్ల రాజకీయం కోసం పాకులాడే ప్రాంతీయ పార్టీల వైఖరికి దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దారుణం. పాఠశాల స్థాయి విద్యలో త్రిభాషా సూత్రాన్ని పాటించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరాఠీ భాషాభిమానాన్ని నరనరానా నింపుకున్నప్పటికీ గత 18 సంవత్సరాలుగా ఉప్పు, నిప్పుగా వుంటున్న ఠాక్రే సోదరులు ఏకం కావడానికి దోహదం చేసింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరాఠీభాషకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ వీరు విరుచుకుపడ్డారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సమితి నాయకుడు రాజ్ ఠాక్రేలు ఇప్పుడు మరాఠీభాషపై ఒకే రాగం వినిపిస్తున్నారు. అయితే తాను తీసుకున్న నిర్ణయం సరికొత్త సమస్యకు దారితీయడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం దీని అమలులో వెనక్కి తగ్గింది. దీంతో ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఠాక్రే సోదరులు జులై 5న ‘విజయోత్సవాలు’ నిర్వహించడం ఈ భాషా వివాద ఎపి సోడ్‌లో పరాకాష్ట. ఇతవరకు బాగానే వున్నప్పటికీ, ఠాక్రే సోదరులు కలిసి భాషా ‘నినాదం’ చే యడం కొత్త సమస్యలకు దారితీస్తుందేమోన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉపాధి పొందుతున్నారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో చెలరేగిన మరాఠీ భాషాభిమానంతో ఠాక్రే సోదరుల అనుచరులు గుజరాత్, ఉత్తరభారత్ నుంచి ముంబయిలో నివాసముంటున్న వ్యాపారులతో పా టు వివిధ రంగాలకు చెందినవారిపై విపరీతంగా దాడులు చేయడం చరిత్ర. మళ్లీ అది పునరా వృత్తమవుతుందా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నిజానికి భాషా వివాదాం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాదు, ఇటీవల బెంగళూరులో ఒక బ్యాంక్ మేనేజర్ కన్నడంలో మాట్లాడటానికి అంగీకరించనందుకు, పెద్ద గొడవే జరిగింది. చివరకు సదరు బ్యాంకు యాజమాన్యం మేనేజర్‌ను బదిలీచేసి వివాదానికి తెరదించింది. ఇక తమిళనాడు లో డీఎంకే రాజకీయాలు చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క డీఎంకే నాయకుడికి హిందీ వస్తుంది. కానీ అంతా హిందీని తీవ్రంగా ద్వేషిస్తారు. ప్రాంతీయ పార్టీల మూర్ఖత్వం వల్ల దెబ్బతినిపోయేది ప్రజలు మాత్రమే. నాయకులు బాగానే వుంటారు. ఓట్ల రాజకీయం కోసం వీరి రెచ్చగొట్టే వ్యవహారశైలి దేశ సమగ్రతకు ఎంతమాత్రం ఉపయోగపడదు! స్థానిక భాష తల్లితో సమానం కనుక దాన్ని గౌరవించి తీరవలసిందే. మాతృభాషలో బోధన జరగాల్సిందే. అయితే దేశవ్యాప్తంగా అనుసంధానత ఏర్పడాలంటే జాతీయభాషను అనుసరించక తప్పదు. దీన్ని పక్కనబెట్టి తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టడంవల్ల అశాంతి తప్ప ఒరిగేదేమీ వుండదు.
నిజానికి దేశం సాంత్రంత్య్రం పొందిన తర్వాత, క్రమంగా భాషావివాదాలు చోటుచేసుకోవడం మొదలైంది. దీనికి ఆద్యులుగా చెప్పుకోవలసింది ఆంధ్రరాష్ట్ర ఉద్యమం. తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పొట్టిశ్రీరాములు నిరాహారదీక్ష, ఆత్మార్పణం, 1952 ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అప్పటి ప్రధాని నెహ్రూకు ఎంతమాత్రం ఆమోదయోగం కాకపోయినా, ఆంధ్ర పరిణామాల నేపథ్యంలో ఆయనపై విపరీతమైన ఒత్తిడి పెరిగిన నేపథ్యం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి దారితీసింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఈవిధంగా ఏర్పడినవే. తర్వాత బంబాయి రాష్ట్ర వివాదం మరో ప్రకంపనలకు కారణమైంది. సంయుక్త మహారాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బంబాయి రాజధానిగా మరాఠీ బాష మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆందోళన మొదలైంది. 1955`56లో ఈ ఉద్యమంలో 106మంది ప్రాణాలు కోల్పోవడం చరిత్ర. చివరకు 1960 మే 1న బంబాయి పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చింది. ఫలితంగా బంబాయి రాజధానిగా మహారాష్ట్ర ఏర్ప డిరది. నాటి బంబాయి రాష్ట్రం నుంచి గుజరాతీ మాట్లాడేవారితో గుజరాత్ రాష్ట్రం ఏర్పడిరది. ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల మధ్య బెలగావీ వంటి సరిహద్దు ప్రాంతాలపై వివాదం కొనసాగు తూనే వుండటం గమనార్హం.
ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో భాషావివాదాలు చెలరేగడానికి ప్రధాన కారణం, ఉత్తర భారత రా ష్ట్రాలైన ఉత్తప్రదేశ్, రaార్ఖండ్, బిహార్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలనుంచి పెద్దఎత్తున జీవనోపాధికోసం ప్రజలు ఇతర రాష్ట్రాల్లోని టైర్`2 నగరాలకు వలసపోవడంతో, సాంస్కృతిక, భాషా పరమైన కొత్త సంప్రదాయాల ప్రవేశంతో పాటు జనాభాపరంగా కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. హాస్పిటాలిటీ, నిర్మాణరంగం, భద్రత వంటి రంగాల్లో బ్లూకాలర్ ఉద్యోగాలకు, ఉత్తరాదినుంచి వచ్చిన హిందీభాష మాట్లాడేవారు వెన్నెముకగా మారారు. ఇదే సమయంలో ముంబయి, బెంగళూరు, పూణె, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు ఇదే ఉత్తరభారత్ నుంచి వైట్ కాలర్ (ముఖ్యంగా ఐటీ) ఉద్యోగులు వలస రావడం బాగా పెరిగిపోయింది. వీరి జనాభా క్రమంగా పెరిగిపోవడంతో, స్థానికులు వీరితో సమాచారాన్ని పంచుకోవడానికి హిందీ లేదా ఇంగ్లీషు
భాషలపై ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి పదివేల మందిలో హిందీ భాషను మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈవిధంగా వలసవచ్చిన వారి ప్రభావం క్రమంగా పెరగడంతో స్థానికుల్లో అభద్రతకు దారితీస్తోంది.
ఈ ‘అభద్రత’ భావాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల ఓట్లు దండుకోవచ్చన్న సత్యాన్ని గ్రహించిన ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు, ప్రాంతీయ భాషా వివాదాలను రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. తమిళనాడులోని డీఎంకే, పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలోని శివసేన వంటి పార్టీల మనుగడ ఈ ప్రాంతీయ భాషా వివాదాలపై ఆధారపడివుంటం గమనార్హం. ఇటీవలి కాలంలో నరేంద్రమోదీ, అమిత్‌షాలు జాతీయస్థాయిలో రాణిస్తున్న నేపథ్యంలో బీజేపీని గుజరాతీ పార్టీగా, వీరిద్దరినీ గుజరాత్‌కు మాత్రమే ప్రయోజనం కల్పించే నాయకులుగా ఈ ప్రాంతీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఆవిధంగా బీజేపీని గుజ రాత్‌కు చెందిన పార్టీగా ప్రజల్లో చూపించడానికి తీవ్రంగా యత్నిస్తున్నాయి.
1960 ప్రాంతంలో శివసేన అధినేత బాల్ థాకరే, ముంబయిలో తమిళ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మరాఠీ యువత ఉద్యోగాలను తమిళులు ఆక్రమించేస్తున్నారంటూ రేపిన ఉద్యమంతో, అప్పట్లో ముంబయి మున్సిపల్ ఎన్నికల్లో శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది. అయితే తర్వాతి కాలంలో శివసేన ప్రగతి ఆగిపోయింది. ఒకదశలో పార్టీ భవిష్యత్తు అగమ్యగోచర స్థితికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్, బంబాయి ప్రాధాన్యతను తగ్గించే విధంగా కొన్ని ప్రకటనలు ఇవ్వడం, బాల్ థా కరేకు కలిసొచ్చింది. దీంతో మరాఠీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి 1985లో జరిగిన బీఎంసీ ఎన్నిక ల్లో కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది. అయితే భాషా రాజకీయాలవల్ల ప్రయోజనం చాలా పరిమితమేనన్న సత్యం థాకరేకు బాగా అర్థం కావడంతో ఒక్కసారిగా హిందూత్వకు అనుకూలంగా దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఆవిధంగా పార్టీ బేస్‌ను రాష్ట్రంలో మరింత విస్త రించు కోవడమే కాదు 1995నాటికి బీజేపీలో జట్టుకట్టే స్థాయికి పార్టీని తీసుకెళ్లారు.
ఇక మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టి మరాఠీ సెంట్మెంట్ను రెచ్చగొట్టడంతో 2009లో లోక్‌సభ ఎన్నికల్లో గుర్తించదగిన స్థాయిలో ఓట్ల షేర్‌ను పొందగలిగింది. అయితే కేవలం భాషా రాజకీయాలు ఎంఎన్ఎస్ ఎ దుగుదలకు ఎంతమాత్రం దోహదం చేయలేదు. పలితంగా పార్టీ ఎదుగుబదుగులేని స్థితిలో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోంది. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి (ఎంఈఎస్) పరిస్థితి కూడా ఇంతకు మించి గొప్పగా ఏమీ లేదు. బెలగావి ప్రాంతంలో మరాఠీ ప్రజల హక్కులకోసం పోరాటం మొదలుపెట్టినా, ఇప్పుడు ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది.
పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే 2021ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, స్థానిక బెంగాలీ మరి యు ఇతర ప్రాంతాలవారు అన్న అంశాన్ని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా బీజేపీ స్థానిక పార్టీ కాదని, వీరు ఉత్తరాదినుంచి వచ్చినవారుగా అంటే ‘బోహిర్గటో’గా ప్రచారం చేసింది. ఆవిధంగాబెంగాలీ హిందువుల్లోకి బీజేపీ చొచ్చుకెళ్లకుండా అడ్డుకోవడానికి యత్నించింది. ఇదే సమయం లో బీజేపీ హిందూత్వను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే తృణమూల్ అమలు చేసే సంక్షేమ పథకాలు, ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడటంతో అధికారంలోకి రాగలిగింది. అంతేకాదు ‘బెంగాలీ అస్మిత’కు తానే ప్రతినిధిగా చూపుకోవడానికి మమతా బెనర్జీ తీవ్రంగా యత్నించారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే డీఎంకే ఇప్పుడు హిందీ వ్యతిరేక భావజాలాన్ని బాగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ఉనికి నామమాత్రమే. ఈ నేపథ్యంలో గట్టి పోటీదారులైన డీఎంకే, ఏఐడీఎంకేల మధ్యనే అధికార మార్పిడి జరుగుతుంటున్న నేపథ్యంలో, ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది.
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు, బీజేపీని గుజరాతీల పార్టీగా ప్రచారం చేశాయి. ముఖ్యంగా గుజరాతీ వ్యాపారులు, మరాఠి అస్మితను దెబ్బతీస్తున్నా రంటూ ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి యత్నించారు. ఇంతగా ప్రచారం చేసినా మహాయుతి (ఎన్డీఏ) మొత్తం 288 స్థానాల్లో 235సీట్లను గెలుచుకొంది. మొత్తంమీద ఈ విశ్లేషనలను పరిశీలిస్తే, ప్రాంతీయ భాషా వివాదాలు, ప్రాంతీయతలు భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, ఎన్నికల సమయంలో ఓట్లను రాబట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తాయన్నది స్పష్టమవుతోంది. ఇదే సమయంలో ఒక్క భాషా వివాదాన్ని పట్టుకొని వేలాడటం వల్ల ఏ పార్టీకి భవిష్యత్తు వుండదనేది కూడా సుస్పష్టం. ఎంతవద్దనుకున్నా టైర్`2, టైర్`3 పట్టణాల్లోకి ఉపాధి అవకాశాల నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో భాష కంటే, సౌకర్యాలు, సదుపాయాలు, సుపరిపాలనకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఎక్కువ. భాషా వివా దాలవల్ల ప్రయోజనం లేదని, కేవలం సుపరిపాలన వల్లనే సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభ వించగలుగుతామన్న భావన పెరగడంవల్ల పార్టీలు కూడా భవిష్యత్తులో తమ స్టాండ్‌ను మార్చుకోక తప్పదు.