బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి భవాని శంకర్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి :
రేగా కాంతారావు సంకల్పంతో ఆదిలాబాద్ నుండి
అశ్వారావుపేట వరకు పోడుసాగు దారులకు పట్టాలు ఇప్పించిన ఘనత రేగా కాంతారావుకు దక్కుతుందని గుండాల మండల ఇన్చార్జ్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. పోడు పట్టాల కోసం జీవో తీసుకువచ్చిన ఘన చరిత్ర పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు దక్కుతుందన్నారు. శుక్రవారం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పర్యటించి బీ ఆర్ ఎస్ పోడు పట్టాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్న పోడుదారులకు పట్టాలు అందించాడని అన్నారు. నియోజకవర్గంలో ఒకేసారి పోడు పట్టాలను పంపిణీ చేశారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చందా హరికృష్ణ, పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్యా సమితి మోకాళ్ళ వీరస్వామి, లింగగూడెం సర్పంచ్ నరసింహారావు, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్టా రాములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు వట్టం రవి, కొరసాల ఆలయ, సుధాకర్, సుధాకర్, జాడి ప్రభాకర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.