గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి :
ఆళ్లపల్లి మండల ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి ఆధ్వర్యంలో అనంతోగు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాయం నరసింహారావు ,ఆళ్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబా , ఆళ్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి నరెడ్ల ప్రవీణ్ కుమార వర్మ,కోఆపరేట్ డైరక్టర్ ఈసం సాంబశివరావు, కండె వెంకన్న , వేమూరి రాంబాబు, మార్కోడు గ్రామ పంచాయితీ నాయకులు, మరియు అనంతోగు గ్రామపంచాయితీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.