వేసవి ఎండల దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి తగ్గిన వసతులు కల్పించాలి

పి ఆర్ టి యు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్

నడికూడ,నేటి ధాత్రి: రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైన నమోదవుతున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించడానికి ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు పోలింగ్ స్టేషన్ లలో కూలర్లను ఏర్పాటు చేయాలని పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈనెల 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు.అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని,ఎన్నికల సిబ్బందిని పోలింగ్ స్టేషన్ లకు తీసుకు వెళ్లే వాహనాలు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని,రిసిప్షన్స్ సెంటర్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రతి ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలలో మరియు పోలింగ్ స్టేషన్ లలో తప్పనిసరిగా కూలర్లు, చల్లని త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా, ఉద్యోగ,ఉపాధ్యాయులకు అటెండెన్స్ సర్టిఫికెట్ అదే రోజు అందజేసేలాగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి తిరుగు ప్రయాణంలో సొంత ప్రాంతాలకు వెళ్లే విధంగా వాహనాల సౌకర్యం కల్పించాలని ఆయన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!