కరీంనగర్, నేటిధాత్రి:
వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం కరీంనగర్ లో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడమంటే మాదిగలను మోసం చేయడమే అన్నారు. సుప్రీం కోర్టు ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ మీద రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసే విధంగా వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాల నియామకాలు చేయడం మాదిగలను వంచించడమే అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదట తనే వర్గీకరణ అమలు చేస్తాను అని, అవసరం ఐతే గెజిట్ తీసుకువచ్చి వర్గీకరణ అమలు చేస్తాను అని చెప్పి ఈరోజు మాటలు మార్చడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ద్రోహిగా వ్యవహరిస్తూ , మాలలకు కొమ్ముగాస్తుందన్నారు ఇది రేవంత్ రెడ్డి మోసపూరిత వైఖరికి నిదర్శనం. వర్గీకరణ వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈనెల 9వ తేదిన అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో మాదిగల నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున చేపడతామన్నారు. ఈర్యాలీకి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుండి మాదిగ మాదిగ ఉప కులాలు జాతి లక్ష్యం కోసం తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రుద్రారం రామచందర్ మాదిగ, ఎమ్ఎస్పి జాతీయ నాయకులు బోయిని కొమురయ్య మాదిగ,
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
కనకం అంజిబాబు మాదిగ,
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రెనుకుంట్ల సాగర్ మాదిగ,
ఎమ్ఎస్పి నాయకులు దండు అంజయ మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, అంబల మధునయ్య మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, బెజ్జంకి నరేష్ మాదిగ, గంగాధర రవి మాదిగ, చిలుముల లక్ష్మణ్ మాదిగ, గడ్డం కొమురక్క మాదిగ, పర్లపెళ్లి తిరుపతి మాదిగ, సీపల్లి నరేష్ మాదిగ, కన్నం నర్సయ్య మాదిగ, కథ మల్లయ్య మాదిగ, జిల్లాల రమేష్ మాదిగ, కనుకుంట్ల శ్రీనివాస్ మాదిగ, కొమ్ముల రాజమల్లు మాదిగ, నక్క లక్ష్మణ్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.